హైదరాబాద్

హెరిటేజ్‌లో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 22: శ్రీనగర్‌కాలనీలోని హెరిటేజ్ స్టోర్‌లో ఆదివారం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 5:30 గంటల ప్రాంతంలో హెరిటేజ్ స్టోర్ నుంచి దట్టమైన పొగలు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు స్టోర్ అద్దాలను పగుల గొట్టి మంటలను ఆర్పివేశారు. స్టోర్ వెనుక వైపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఏర్పడ్డ నిప్పురవ్వల కారణంగా అందులోని కాగితాలు దగ్దం కావడంతో పొగలు కమ్ముకున్నట్టు తేల్చారు.

ఈశ్వరత్వంతో మానవతకు సార్థకత
హైదరాబాద్, అక్టోబర్ 22: త్రరుూ సాధనతో మానవునిలోని రాక్షతత్వాన్ని నిర్మూలించి, ఈశ్వరత్వం గ్రహించి మానవతకు సార్థకత కల్పించవచ్చని శ్రీవిశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి ఉమర్ అలీషా అన్నారు. ఆదివారం మధురానగర్‌లోని సాగి రామకృష్ణం రాజు కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించారు. ఉమర్ అలీషా అధ్యక్షత వహించగా ఆదాయ పన్ను శాఖ రిటైర్డ్ అధికారి డా.వివిఎస్ రమావతారం, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ విసి ఆవుల మంజుల ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగించారు. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ నుంచి ఆదర్శ బాల వేదిన అనాథాశ్రమ బాలబాలికలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ‘ఆశ-ఆనందం’ అనే లఘు నాటకం, పర్యావరణ పరిరక్షణ తెలిపే నాట్యాన్ని ప్రదర్శించారు. ఎస్.ఉమేశ్, రిటైర్డ్ జడ్జి నాగమారుతీ శర్మ, పీఠం కన్వీనర్ పేరూరి సురిబాబు పాల్గొన్నారు.