హైదరాబాద్

రేవంత్‌తో ఎవరూ వెళ్లరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్ల అన్న ఎన్టీఆర్ అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమానికి, రాజ్యాధికారాన్ని అందించాలన్న గొప్ప సంకల్పంతో స్థాపించిన తెలుగుదేశం పార్టీలో నిస్వార్థపరులైన నాయకులు ఎప్పటికీ కొనసాగుతారని నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సోమవారం నగర టిడిపి కార్యాలయంలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎం.ఎన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఏ పార్టీలోనైనా చేరే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, కానీ తనతో పాటు మరికొందరు నేతలు వస్తున్నట్లు రేవంత్‌రెడ్డి పలువురు టిడిపి నేతల పేర్లను ప్రకటించటం బాధాకరం అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మొత్తం ప్రపంచ దృష్టినే ఆకర్షించిందని ఆయన వివరించారు. పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు, మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమైన సమయంలో ఇలాంటి పరిణామాలు జరగటం దురదృష్టకరం అన్నారు. ఇలాంటి ఎన్ని సంఘటననలు జరిగినా నగర టిడిపి కమిటీ నేతలంతా నిస్వార్థంగా పార్టీకి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని, ఇతర పార్టీల్లోకి చేరితే తమకు పదవులోస్తాయేమోనన్న ఆశ తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. బిసి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కూన వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ తాము కూడా పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది టిడిపితోనేనని, బతికున్నంత కాలం టిడిపిలోనే కొనసాగుతానని కూన తేల్చి చెప్పారు.
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకెల దీపక్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా తాను ఎప్పటికీ టిడిపిలోనే, చంద్రబాబు వెంటే ఉంటానని తెలిపారు. బాబు ప్రస్తుతం ఏపిలో చేస్తున్న అభివృద్ధిని చూసి తెలంగాణ ప్రజలు కూడా స్వచ్ఛందంగా టిడిపికే అధికారాన్ని కట్టబెట్టేందుకు ఎదురుచూస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు వనం రమేష్, బజరంగ్ శర్మ, మహిళా అధ్యక్షురాలు షకీలారెడ్డి పాల్గొన్నారు.