హైదరాబాద్

సిఎం ఆఫీసు పిటిషన్లకు అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: రకరకాల ప్రజాసమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి వచ్చే పిటిషన్లకు అధిక ప్రాధాన్యతనిచ్చి, వాటి నివేదికలను వెంటనే సమర్పించాలని అధికారులను జిల్లా ఇన్‌చార్జి జెసి నిఖిల ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో డిఆర్వో సరళావందనం, ఆర్డీవో చంద్రకళతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, పిటిషన్లను స్వీకరించారు. పాటిగడ్డకు చెందిన తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ సభ్యులు 1995లో వేసిన బోరు నుంచి నీరు సరిగ్గా రావటం లేదని, దీంతో అనేక ఇబ్బందులెదుర్కొంటున్నామని వెంటనే కొత్త బోరు వేయించి యాభై రజక కుటుంబాలకు ఉపాధి కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఇందుకు స్పందించిన ఇన్‌చార్జి జెసి.. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కవాడిగూడకు చెందిన కె.కృష్ణవేణి 30 సంవత్సరాల నుంచి అదే ప్రాంతంలో నివసిస్తున్నానని, ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్‌రూం ఇళ్లలో తనకు కేటాయింపు జరపలేదని, వెంటనే తనకు ఇళ్లు కేటాయించాలని అభ్యర్థించారు. ఈ విషయాన్ని ముషీరాబాద్ తహశీల్దార్ పరిశీలించి తగిన చర్య తీసుకోవాలని ఇన్‌చార్జి జెసి ఆదేశించారు. జియాగూడకు చెందిన వౌనిక తన భర్త దర్శన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని, తనకు పది నెలల వయస్సు గల అబ్బాయి ఉన్నాడనని, తనకేమీ ఆధారం లేదంటూ, ఆపద్బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ఇందుకు స్పందించిన ఇన్‌చార్జి జెసి.. ఆసిఫ్‌నగర్ తహశీల్దార్ ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గంగానగర్ బస్తీకి చెందిన అంగన్‌వాడీ టీచర్ వి.అరుణాబాయి కమ్యూనిటీ హాల్‌లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ భవనం పాతపడిపోయిందని, కూల్చివేస్తామంటూ బస్తీ కమిటీ ఒత్తిడి చేస్తున్నారని మొరబెట్టుకున్నరు. మహిళా శిశు సంక్షేమాధికారి ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్య తీసుకోవాలని ఇన్‌చార్జి జెసి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎవో రాధిక రమణ, సిపివో బలరాం, విద్యాశాఖాధికారి రమేశ్ పాల్గొన్నారు.