హైదరాబాద్

కెసిఆర్‌కు సిఎం పదవి.. విద్యార్థులు పెట్టిన భిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, అక్టోబర్ 23: ‘కెసిఆర్‌కు ముఖ్యమంత్రి పదవి విద్యార్థులు పెట్టిన భిక్ష’ అని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఓయులో నిరుద్యోగ జెఎసి ఆధ్వర్యంలో జరిగిన ధూంధాం కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమపోరాటంలో త్యాగాలకు నిలబడి పోరాడిన నిరుద్యోగులకు కాకుండా తెలంగాణ ద్రోహులకు ఉద్యోగాలు కట్టబెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నిధులను ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నీరుగారుస్తున్నారన్నారు. ‘నాకు పిల్లలు లేరు.. మీరే నా పిల్లలు.. నా జీవితం ప్రజాసేవకే అంకితం’ అని ఉత్తమ్ పునరద్ఘాటించారు. విద్యార్థి, నిరుద్యోగుల పోరాటాలను చూసి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చలించిపోయి తెలంగాణను ఇచ్చిందని, కాని నిజంగా నిరుద్యోగ యువకులకు దక్కాల్సిన ఉద్యోగాలు వారికి దక్కడం లేదని, తెరాస పాలనలో పరాయిలకే పెద్దపీట వేస్తున్నాఠన్నారు. కెసిఆర్‌కు సిఎం పదవి విద్యార్థులు పెట్టిన భిక్ష అని విస్మరిస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉన్నత విద్య కోసం ఉత్తమ ఆశయాల సాధనకోసం, ఆదర్శవంతమైన తెలంగాణ కోసం చేసిన పోరాటాలను అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన శక్తులు, నేడు తెలంగాణ పాలకవర్గంగా ఉండి తెలంగాణకు తీవ్ర ద్రోహం తలపెడుతున్నారన్నారు. విజ్ఞానులైన మీరంతా ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు కట్టుబడి ఉండి ఏర్పాటు చేసిందని, కాని తెలంగాణ ద్రోహులు ప్రజలను తప్పుదారి పెట్టించి అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారని అన్నారు. తెరాస చెప్పిన ఉచిత విద్య, లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని, తెలంగాణలో విద్య, ఉద్యోగాలు రావాలంటే కెసిఆర్‌ను గద్దె దించాల్సిన అవసరం ఉందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నిరుద్యోగ జెఎసి చైర్మన్ మానవతారాయ్ అధ్యక్షత వహించారు. ఓయు విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు పెద్దఎత్తున హాజరయ్యారు.
ఎన్‌టిఆర్ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదు
ఖైరతాబాద్, అక్టోబర్ 23: తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రతిష్టను దెబ్బతీసేలా రామ్‌గోపాల్ వర్మ సినిమా తీస్తే సహించేది లేదని అవైడ్ వైల్‌డనెస్ అండ్ ఎస్టిలైన్ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి దయానంద రావు హెచ్చరించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దయానంద రావు మాట్లాడారు. రామ్‌గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్‌టిఆర్ పేరుతో సినిమాను తీయనున్నట్టు ప్రకటించినప్పటి నుంచి ఎన్‌టిఆర్ అభిమానుల్లో ఆందోళన మొదలైందని అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన ఎన్‌టిఆర్‌ను నెగెటివ్ రోల్‌లో చూపిస్తే అభిమానుల ఆగ్రహానికి గురికాక తప్పదని పేర్కొన్నారు. అనంతపురం ఎమ్మెల్యే, అవే సంస్థ వ్యవస్థాపకుడు ప్రభాకర్ చౌదరిపై సామాజిక మాధ్యమాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసేలా సినిమాలు తీస్తే ప్రజల తగిన విధంగా స్పందిస్తారని హెచ్చరించారు. సమావేశంలో సొహెరా బేగం, రాజారావు, నాగరాజు, వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

వివాహితపై కత్తితో దాడి

సనత్‌నగర్, అక్టోబర్ 23: తనతో అక్రమ సంబంధం ఏర్పర్చుకోవాలని ఒత్తిడి చేస్తూ వచ్చిన ఓ యువకుడు అందుకు నిరాకరించడంతో వివాహితపై ఏకంగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. సంజీవరెడ్డినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బికెగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న యాదగిరి ఆటోడ్రైవర్‌కు - యువతితో 2013లో వివాహం జరిగింది. వీరి ఇంటికి సమీపంలో ఉండే ఎలక్ట్రీషియన్ రవికుమార్ పెళ్లి అయినప్పటి నుంచి ఆమెతో అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడు. ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో యాదగిరి కుటుంబం కొంతకాలం హిమాయత్‌నగర్‌కు వెళ్లింది. ఇటీవలే తిరిగి బికె గూడకు వచ్చారు.ప్రవర్తన మార్చుకోని రవికుమార్.. అదే తరహాలో ఆమెతో ప్రవర్తించసాగాడు. సోమవారం కూడా అసభ్యంగా ప్రవర్తించడంతో రవికుమార్ తల్లిదండ్రులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో కోపం పెంచుకున్న రవికుమార్ ఎర్రగడ్డ రైతు బజార్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో తలపై, చేతిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర రక్తస్త్రావం కాగా.. మొదట స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. వివాహితపై దాడి చేసిన విషయాన్ని గుర్తించిన పాదచారులు.. రవికుమార్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.