హైదరాబాద్

నిధి కూచిపూడి నృత్య విన్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: అంతర్జాతీయ నాట్యాచార్యులు డా. వెంపటి చిన సత్యం శిష్య పరంపరలో చిన్న వయసులోనే ఎంతో ప్రతిభను సాధించిన చిన్నారి నిధి శనివారం సాయంత్రం రవీంద్రభారతిలో చక్కని ఆంగికాభినయంతో నృత్యం ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిధి ప్రదర్శించిన కామాక్షి స్తుతి అందరినీ అలరించింది. జగన్మాత ఆదిపరాశక్తి అవతారమైన కామాక్షిదేవి అవతార విశేషాన్ని స్తుతిస్తూ అభినయంతో అమ్మవారి రూపాలను అభినయంలో ప్రదర్శించింది. భైరవి రాగంలో భామా కలాపంను ప్రదర్శించే తరుణంలో నిధి అభినయంలో గురువు సామర్ధ్యాన్ని కనబరిచింది. నృత్య కార్యక్రమం గణేష్ కౌతంతో ప్రారంభించింది. ఈ అంశాన్ని తొలుత గౌళ రాగంలో డిఎస్‌వి.శాస్ర్తీ గాత్రంతో ప్రారంభించి ఆరభి రాగంలో స్వరజతులను అందుకుంటే ఆ జతులకు అనుగుణంగా సమయస్ఫూర్తితో అడుగుల సవ్వడితో ప్రేక్షకులకు కనువిందు చేసింది. బాలగోపాలకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి నంద వంశ ప్రజలను రక్షించిన గోవర్ధన గిరిధారుడిగా రాగమాలికా రాగంలో ప్రదర్శించిన నృత్యం అభినయ మందారం అనడంలో అతిశయోక్తి లేదు. చివరి అంశంగా హంస నందిని రాగంలో తిల్లాన చక్కని పద విన్యాసంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. పి.సురేష్‌రెడ్డి, ఆశారెడ్డి దంపతుల పుత్రిక నిధి ఆరేళ్ల వయసులో నృత్యం ప్రారంభించి న్యూజెర్సీ నుంచి భారతదేశానికి వచ్చి కొంతకాలం గురువు దీపికారెడ్డి ఆశీస్సులతో విజయశేఖర్ శిష్యరికంలో ఎంతో ప్రాముఖ్యతను సంపాదించింది.
కళావేదికపై గురు సత్కారం చేసిన నిధి ప్రేక్షకాభిమానులకు కళాభివందనాలు తెలిపింది. అధికార అనధికార రాజకీయ ప్రముఖులు చిన్నారి నిధిని ఆశీర్వదించారు. నాట్యాచార్యులు కె.విజయశేఖర్ నట్టువాంగంతో సహకరించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిధిని అభినందించారు.