హైదరాబాద్

టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పదవతరగతి పరీక్షల నిర్వహణ కోసం హైదరాబాద్ జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సోమవారం నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో జిల్లావ్యాప్తంగా రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు కలిపి మొత్తం 80వేల 44మంది పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం జిల్లాలో 355 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 300 కేంద్రాలు రెగ్యులర్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేయగా, మరో 54 కేంద్రాలు ప్రయివేట్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. సోమవారంనుంచి ప్రారంభమయ్యే పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరుగుతాయి. ద్వితీయభాష పరీక్షకు మాత్రం అరగంట అదనంగా కేటాయించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే అనుమతించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో వౌలిక సౌకర్యాలు కల్పించేందుకు వివిధ శాఖల అధికారులు అన్ని ఎర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సోమిరెడ్డి తెలిపారు. జలమండలి, జిహెచ్‌ఎంసి, పోలీసు శాఖలకు చెందిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అల్లర్లు జరుగకుండా ఉండేందుకు గాను నగర పోలీసుల 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.
పరీక్షల్లో కాపీయింగ్‌కు ఎలాంటి ఆస్కారం లేకుండా నిఘాను ముమ్మరం చేశారు. ఈసారి నగరంలోని ఎర్రమంజిల్ పభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రయోగాత్మకంగా సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలలో తనిఖీలను ముమ్మరం చేస్తామని, అందుకోసం 355 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు 355 మంది డిపార్ట్‌మెంట్ అధికారులు పర్యవేక్షణ అధికారులుగా నియమించిన్నట్లు డిఇఓ తెలిపారు. పరీక్షలకు మొత్తం 4వేల మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుండి పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తామని, పరీక్ష ప్రారంభించిన తరువాత ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను లోనికి అనుమతిస్తామని డిఇఓ తెలిపారు. పరీక్షలు సక్రమంగా విజయవంతంగా నిర్వహించేందుకు, పరీక్ష కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేసేందుకు మొత్తం నగరంలో 21 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ఉప విద్యాధికారి లేదా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్ స్థాయి అధికారి, డిప్యూటీ తహశీల్దార్, ఎస్సై స్థాయి అధికారి ప్రతి స్క్వాడ్‌లో ఉంటారు. నగరంలో ఏడు సమస్యాత్మక కేంద్రాల్ని విద్యాశాఖ గుర్తించి అక్కడ సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించింది. పరీక్ష సమయంలో కేంద్రాల్లో ఏవైనా సంఘటనలు చోటు చేసుకుంటే అక్కడ కూడా ప్రత్యేక సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమిస్తామని ఆయన చెప్పారు.
ఈ సారి పదోతరగతి పరీక్షల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువగా పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 80,044 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 68,705 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 11,339 గత పరీక్షలో ఫెయిల్ అయిన వారు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 33, 713 మంది బాలురు, 34,992 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నారు. ప్రయిట్ విద్యార్థుల్లో 6,851 మంది బాలురు, 4,488 మంది బాలికలు పరీక్షల్లో పాల్గొననున్నారు. పదవ తరగతి పరీక్షల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(స్‌ఆర్టీసీ) నగరంలో విద్యార్థులకోసం వెయ్యి బస్సులను పదోతరగతి స్పెషల్ పేరిట నడుపుతొంది. పరీక్షల సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అదేశించారు.