హైదరాబాద్

నటి రాజశ్రీకి కాంతారావు జీవిత సాఫల్య పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, నవంబర్ 16: ప్రముఖ నటుడు టిఎల్ కాంతారావు జయంతి సందర్భంగా ప్రముఖ స్వర్ణయుగ నటి రాజశ్రీకు టిఎల్ కాంతారావు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు ‘స్వర్ణ కంకణ’ బహూకరణ ప్రదానోత్సవ కార్యక్రమం డా.టి.సుబ్బరామి రెడ్డి లలిత కళా పరిషత్, వంశీ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామి రెడ్డి పాల్గొని రాజశ్రీకు కాంతారావు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణ కంకణ బహూకరించారు. కాంతారావు మహనటుడని కీర్తించారు. కళలకు మహాశక్తి ఉందని, కళారంగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. కాంతారావు కుటుంబానికి రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కెవి రమణాచారి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రజానటి డా.జమున రమణరావు, నటులు గిరిబాబు, కోట శ్రీనివాస రావు, కవిత, గీతాంజలి, రోజా రమణి, లయన్ విజయ్ కుమార్, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు. సభకు ముందు గాయనీ, గాయకులు అలపించిన సినీ సంగీత విభావరి అందరినీ అలరించింది.
కాంతారావు లఘుచిత్ర పదర్శన
ప్రముఖ సినీ నటుడు కాంతారావు జయంతి సందర్భంగా లఘు చిత్ర పదర్శన శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ బిసి కమిషన్ సభ్యుడు జూలూరి గౌరి శంకర్, గానసభ అధ్యక్షుడు కళా జానర్దన మూర్తి, చరణ్, వసంత లక్ష్మి పాల్గొని కాంతారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.