హైదరాబాద్

హుక్కా సెంటర్‌పై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ/ఘట్‌కేసర్, నవంబర్ 16: అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా కేంద్రంపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి నిర్వహకులను అరెస్టు చేసి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఘట్‌కేసర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ మల్లయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. కాప్రా పరిధిలోని ఏఎస్‌రావునగర్‌లో హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఏఎస్‌రావునగర్‌లోని ఖజానా జ్యువెల్లరీపై నాలుగో అంతస్థులో అక్రమంగా హుక్కా సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పొగాకులో గంజాయి కలిపి హుక్కా పార్లర్ నిర్వహిస్తుండటంతో పోలీసులు దాడి జరిపి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 90 గ్రాముల గంజాయి కలిపిన మూడు ప్లెవర్ బాక్సులు, 18 పొగాకు ఫ్లేవర్ బాక్సులు, 10 లీటర్ల కల్లు, నాలుగు హుక్కా కుండలతో పాటు హుక్కాలో వాడే బొగ్గు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హుక్కా సెంటర్ నిర్వాహకులు దినేష్, రామకృష్ణయ్యను అరెస్టు చేసినట్లు, మరో నిర్వాహకుడు శ్రీకర్ రెడ్డి తప్పించుకోగా హుక్కా వినియోగించిన అభిషేక్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. హుక్కా కేంద్రంపై దాడి చేసిన వారిలో ఎస్‌టీఎఫ్ ఇన్‌స్పెక్టర్ బీ.ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐలు సుతారి, లింగయ్య, ఎన్.పద్మారావు పాల్గొన్నట్లు తెలిపారు.

రామసేథు యాప్ ఆవిష్కరణ
ఖైరతాబాద్, నవంబర్ 16: సనాతన ధర్మ విశిష్టతలను వివరించడంతో ఆన్‌లైన్‌లో పూజా కార్యక్రమాలను అందించే రామసేథు యాప్ గురువారం ఆవిష్కరించారు. పంజాగుట్టలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో లోగో, యాప్‌ను నిర్వాహకులు దుర్గాప్రసాద్, శ్రీని, మ్యూజిక్ డైరెక్టర్ శశిప్రీతమ్ ఆవిష్కరించారు. సనాతన ధర్మ పరిరక్షణకు సాంకేతికతను సమర్ధవంతంగా వినియోగించుకోవాలనే లక్ష్యంతో యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. కార్యక్రమంలో నటుడు లోహిత్ కుమార్, రవిశంకర్, యాంకర్ ప్రత్యూష పాల్గొన్నారు.