హైదరాబాద్

పలు ప్రాంతాలకు నీటి సరఫరా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: మహానగరంలో పలు ప్రాంతాలకు ఈ నెల 18వ తేదీన(శనివారం) మంచినీటి సరఫరా ఉండబోదని జలమండలి అధికారులు తెలిపారు. ఆటోనగర్‌లోని 300 ఎంఎం డయా ఎంఎస్ పైప్ దెబ్బతిన్నందున పైప్‌లైన్, వాల్వ్‌ను మార్చే పనులు చేపడుతున్నందున మంచనీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు మంచినీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అల్కాపురి సెక్షన్ పరిధిలోని శ్రీన్‌గర్ కాలనీ, న్యూ నాగోల్, సౌభాగ్యపురం, టెలిఫోన్‌కాలనీ, అలాగే మారుతీనగర్ సెక్షన్‌పరిధిలోని చైతన్యపురి, మారుతీనగర్, ప్రభాత్‌నగర్, ఫణిగిరికాలనీ, ఎల్బీనగర్ సెక్షన్ పరిధిలోని రాక్‌టౌన్, జనప్రియ ఎంక్లేవ్, ఇంద్రప్రస్థా, రాఘవేంద్రకాలనీ, సాయినగర్, మన్సూరాబాద్, జైపురికాలనీ, బ్లైండ్స్‌కాలనీ, సరూర్‌నగర్ సెక్షన్ పరిధిలోని క్రాంతినగర్, వికాస్‌నగర్, డిఫెన్స్‌కాలనీ, సాయికృష్ణనగర్,కామేశ్వరకాలనీ, బాలజీకాలనీ, సాయినగర్, బృందావన్‌కాలనీ, లింగోజిగూడ, మధుపురికాలనీ, సరూర్‌నగర్ చావ్‌డి, భగత్‌సింగ్‌నగర్‌లోని కొంతభాగం ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండబోదని అధికారులు తెలిపారు. అలాగే సాహెబ్‌నగర్ సెక్షన్ పరిధిలోని ఊర్మిళనగర్, ద్వారకనగర్, జయకృష్ణ ఎంక్లేవ్, డిఆర్‌డిఎల్‌కాలనీ, అగ్రికల్చరల్‌కాలనీ, వెంకటేశ్వరకాలనీ, హస్తినాపురం సౌత్, పద్మావతికాలనీ, షిరిడీ సాయినగర్, ఇంద్రప్రస్థాకాలనీ, ఆర్‌కెఆర్ ఎంక్లేవ్, శ్రీరాం ఆయోధ్యనగర్, రాజీవ్‌శెట్టినగర్, శ్రీరమణకాలనీ, కస్తూరికాలనీ, భాగ్యనగర్, ద్వారకతిరుమలనగర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఉండదన్న విషయాన్ని గ్రహించి వినియోగదారులు, ప్రజలు అంతకు ముందు జరిగే సరఫరాలో తమ అవసరాలకు కావల్సిన నీటిని నిల్వ చేసుకుని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి సూచించింది.