హైదరాబాద్

చోరీ కేసులో నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, నవంబర్ 17: వ్యవసనాలకు బానిసై డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడుతున్న పోలీసులు అరెస్టు చేశారు. చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో గోపాలపురం ఏసీపీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన కొమిరె పరుశురామ్ బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చి, సనత్‌నగర్‌లోని ఫతేనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. చెడు వ్యవసనాలకు బానిసైన ఇతను డబ్బు అవసరం కావడంతో సునాయాసంగా డబ్బు సంపాదించడానికి, అప్పటికే పాత నేరస్థుడైన తన బావమరిదితో కలిసి దొంగతనాలకు పాల్పడ్డాడు. కొంతకాలానికి బావమదిరి గతించడంతో ఒంటరిగానే భయంకరంగా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి పలుమార్లు జైలుకు వెళ్లివచ్చాడు. ఇతనిపై పీడీ యాక్ట్ కూడా నమోదమైనప్పటికీ ఇతని ప్రవర్తనలో ఎంతమాత్రం మార్పు రాకపోగా జైలు నుంచి బయటికి వచ్చిందే తడవుగా అనువైన ప్రదేశాలను ఎంచుకుని ఇళ్లకు ఉన్న తాళాలను పగులగొట్టి దొంగతనాలు చేయడం సర్వసాధారణంగా మార్చుకున్నాడు. ఇప్పటికే 31 కేసుల్లో నిందిడుగా ఉన్న నిందితుడు పరుశురామ్ ఈ మధ్యనే జైలు నుంచి బయటికి వచ్చి చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడ్డాడు. భారీ ఎత్తున నగదు బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. సంఘటనా స్థలం వద్ద ఆధారాలు స్వీకరించిన పోలీసులు ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఇది పరుశురామ్ చేసిన పనే అని నిర్థారించుకున్నారు. కాగా, శుక్రవారం చిలకలగూడ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని గ్రహించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టి అతని వద్ద నుంచి 18 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

19 నుంచి రాష్టవ్య్రాప్తంగా ‘ఆటా’ సేవా డేస్
సనత్‌నగర్, నవంబర్ 17: అమెరికా తెలంగాణ అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి రాష్టవ్య్రాప్తంగా ఆటా సేవా డేస్ పేరుతో సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఆటా అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం లక్డీకపూల్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివరాలను వెల్లడించారు. ఇక్కడ జన్మించి అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారిచే ఏర్పడ్డ ఆటా ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈనెల 19 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు హైదరాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించడం, ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పన, ఆయా పాఠశాలల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనభరుస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. వీటితో పాటు డిసెంబర్ 3న డ్రగ్ ఫీ సిటీ నినాదంతో నగరంలో 5కే రన్‌ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆటా ప్రతినిధులు రామచంద్రారెడ్డి, వెంకట్, పద్మజా రెడ్డి పాల్గొన్నారు.
జూన్‌లో తెలంగాణ మహాసభలు
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేందుకు వచ్చే సంవత్సరం జూన్ 29 నుంచి అమెరెకా దేశంలో తెలంగాణ మహాసభలను నిర్వహించనున్నట్టు సత్యనారాయణ రెడ్డి తెలిపారు. వేలాది మంది ఆటా ప్రతినిధులు హాజరయ్యే సభలకు అక్కడి ప్రభుత్వ పెద్దలను సైతం ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. మాతృభూమికి తమ వంతుగా సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా సభలు కొనసాగుతాయని తెలిపారు. పేరొందిన సీ.నారాయణ రెడ్డి రచించిన పాటలకు ప్రముఖ నర్తకి పద్మజా రెడ్డి బృందం నృత్యం చేస్తుందని చెప్పారు.