హైదరాబాద్

మెట్రో రైలు.. వికలాంగుల నేస్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: ఒక చోట నుంచి మరోచోటకు ప్రయాణించాలనుకునే వికలాంగులకు అంతంతమాత్రంగా అందుబాటులో ఉన్న సౌకర్యాలు మెట్రోరైలులో మరింత పెరగనున్నాయి. వాహనం తీసుకుని, లేక వాహనం లేకుండా బయటకు రావాలంటే ట్రాఫిక్‌తో అనేక రకాలుగా అవస్థలు పడే మహానగరవాసులకు త్వరలో అందుబాటులోకి రానున్న ప్రపంచంలోనే అరుదైన మెట్రోరైలు ప్రాజెక్టును పర్యావరణ రహితంగానే గాక, డిజేబుల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్టుగా కూడా ఎంతో ముందుచూపుతో డిజైన్ చేశారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 30 నుంచి అరవై అడుగల ఎత్తున ఉండే మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కే ఫ్లాట్ ఫాం వరకు అంగవైకల్యం కల్గిన వికలాంగులు, వినికిడి శక్తి సరిగ్గా లేని వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు మెట్రోరైలు అధికారులు తెలిపారు. ముఖ్యంగా వికలాంగుల కోసం లిఫ్టు వరకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక ర్యాంప్, వీల్‌చైర్లను అందుబాటులో ఉంచనున్నారు. దీంతో పాటు మెట్రోరైలులో ప్రయాణించాలనుకునే అంధుల సౌకర్యార్థం కూడా లిఫ్టులో ఆపరేటింగ్ బటన్‌లను బ్రెయిలీ భాషలో పొందుపర్చినట్లు మెట్రోరైలు ఎండి డా.ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రోరైలు ప్రతిపాదన స్థాయిలోనే ఎంతో ముందుచూపుతో వ్యవహరించిన అధికారులు మెట్రోస్టేషన్‌లోకి చేరుకునేందుకు మూడు రకాల ఆధునిక వౌలిక వసతులను ఏర్పాటు చేశారు.
ఇందులో మహిళలు, వృద్ధులు, పిల్లల కోసం లిప్టులు, ఎస్కలేటర్ల, మెట్లను ఏర్పాటు చేశారు. ఇపుడు వీటికి తోడు వికలాంగులకు సౌకర్యాలను మెరుగుపరిచేందుకుగాను ప్రతి స్టేషన్‌లోని ఈ వౌలిక సౌకర్యాల వద్ద వీల్‌చైర్లను కూడా అందుబాటులోకి తేనున్నారు. అంతేగాక, వీల్‌చైర్లలో వచ్చి రైలులోకి వేళ్లే వికలాంగులు, వృద్ధుల కోసం ప్లాట్ ఫాం, ట్రెయిన్ ఫ్లోర్ మధ్య ఒకేరకమైన గ్యాప్‌ను మెయిన్‌టైన్ చేసేలా డిజైన్ చేశారు. అంధులు సైతం ఈ ప్లాట్‌ఫాం నుంచి ట్రెయిన్‌లోకి వెళ్లేటపుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టారు. ఒక్కసారి వృద్ధులు, వికలాంగులు వీల్‌చైర్‌లో కూర్చున్న తర్వాత, వారు తమ గమ్యస్థానాన్ని చేరుకునే వరకు ఆ చైర్‌లోనే సురక్షితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. అంతేగాక, వీరి సౌకర్యార్థం వీరికి ప్రతి స్టేషన్‌లో ప్రత్యేకంగా టాయిలెట్లను కూడా అందుబాటులో ఉంచారు. ఎక్కడకు వెళ్లాలన్నా, వెంట సహాయకులంటే తప్పా, వెళ్లలేని అంధులు, వికలాంగులు, వృద్ధులకు ఎలాంటి సహాయకుడు అవసరం లేకుండానే మెట్రోరైలులో ప్రయాణించేలా ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
అంధులు, బధిరుల కోసం..
మెట్రోరైలు ప్రతి స్టేషన్‌లో రైళ్లరాకపోకలు, ప్రయాణికుల భద్రత, నిరక్షరాస్యుల సౌకర్యార్థం కోసం మూడు భాషల్లో అనౌన్స్‌మెంట్లు ఉంచేలా ఏర్పాట్లుచేశారు. సక్రమంగా చూడలేని, వినికిడి శక్తిలోపించిన వారికి ఈ ప్రకటనలో ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఒకస్టేషన్ నుంచి రైలు బయల్దేరిన తర్వాత సేఫ్టీ కోసం డోర్‌ల వద్ద నిల్చుండరాదని, ఉన్న స్టేషన్ పేరుతో పాటు ప్రయాణికులు ఎటువైపు నుంచి దిగాలన్న విషయంపై ఈ ప్రకటనలుంటాయి.