హైదరాబాద్

బెస్ట్ స్టడీ సెంటర్ బల్దియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: రానున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంక్‌ను సాధించేందుకు జిహెచ్‌ఎంసి అమలు చేస్తున్న తడి,పొడి చెత్త వేర్వేరుగా సేకరణ వంటి పలు స్వచ్ఛ కార్యక్రమాలు దేశంలోని ఇతర మహానగరాల పాలక సంస్థలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే! అంతేగాక, దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులను జారీ చేసే అరుదైన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చిన జిహెచ్‌ఎంసి ఇపుడు దేశంలోని ఇతర మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు అధ్యయన కేంద్రంగా మారింది. ఏడు సర్కిళ్ల చిన్న మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి నుంచి గ్రేటర్‌గా ఆ తర్వాత ఏకంగా ఏటా సుమారు వెయ్యి కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసుకునే పెద్ద కార్పొరేషన్‌గా ఎదిగిందని ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే! దీనికి తోడు దేశంలోని ఇతర స్థానిక సంస్థలను ఆకట్టుకునేలా పలు స్వచ్ఛ కార్యక్రమాలను నిర్వహిస్తున్న జిహెచ్‌ఎంసికి దేశంలోని ఇతర నగరాలు, మహానగరాల నుంచి అధ్యయనానికి వస్తున్న వస్తున్న బృందాల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, పరిపాలన సంస్కరణలు, అంతర్గత లోపాల దిద్దుబాటు, పెద్ద ఎత్తున వౌలిక వసతులు కల్పించటంతో పాటు సమాజ సేవలో తనవంతు పాత్రను పోషిస్తున్న జిహెచ్‌ఎంసిలో పలు అంశాలపై అధ్యయనం నిమిత్తం వస్తున్నాయి. గడిచిన సంవత్సరకాలంలో ప్రతి పదిహేను రోజులకోసారి ఓ ప్రతినిధుల బృందం జిహెచ్‌ఎంసిని సందర్శించి అధ్యయనం చేసింది. ఒక్క బంగ్లాదేశ్‌లోని 20 మున్సిపాల్టీలకు చెందిన ఉన్నతాధికారులు, సీనియర్ పౌరసేవ అధికారులు గత ఆరు నెలల్లో నాలుగు సార్లు జిహెచ్‌ఎంసిని సందర్శించటం విశేషం. మున్సిపల్ రంగంలో వినూత్న కార్యక్రమాలు, సంస్కరణలను తేవటంతో దేశంలోనే ఇతర కార్పొరేషన్ల కన్నా జిహెచ్‌ఎంసి ముందుంది. జిహెచ్‌ఎంసిని ఉత్తమ అధ్యయన కేంద్రంగా న్యూ దిల్లీలోని జాతీయ స్థాయి శిక్షణ సంస్థలు, హైదరాబాద్ నగరంలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్, డెవలప్‌మెంట్‌తో పాటు అనేక సంస్థలు సూచిస్తుండటంతో పలు అధికార, ప్రజాప్రతినిధుల బృందాలు జిహెచ్‌ఎంసికి చేరుతున్నాయి. ఈ రకంగా ఇప్పటి వరకు రాజస్థాన్, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, అధికారులు జిహెచ్‌ఎంసి అమలు చేస్తున్న కార్యక్రమాలపై అధ్యయనం చేశాయి. బంగ్లాదేశ్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం కూడా జిహెచ్‌ఎంసిని సందర్శించి తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ఆటో టిప్పర్లను సమకూర్చటం, అలాగే ప్రత్యేకంగా ఓ యాప్‌తో నగర వాసులకు స్వచ్ఛ కార్యక్రమాల పట్ల చైతన్యం కల్గించేందుకు చేస్తున్న కృషిపై అధ్యయనం చేసింది. ఈ దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు స్వచ్ఛదూత్, మస్కిటో యాప్‌లు ప్రవేశపెట్టం, పన్నుల విధింపులో ఉన్న అంతర్గత లోపాన్ని సవరించటం, సిగ్నల్ రహిత రహదార్ల ఏర్పాటు ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టు పనులు, డబుల్ బెడ్ రూం ఇళ్ల ఇనర్మాణం, విద్యుత్ వినియోగంతో పాటు బిల్లు భారాన్ని తగ్గించుకునేందుకు ప్రవేశపెట్టిన ఎల్‌ఇడి లైట్ల ఏర్పాటు వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక కార్పొరేషన్‌గా జిహెచ్‌ఎంసి నిలిచింది.
25న ఒరిస్సా బృందం రాక
తాజాగా ఒరిస్సా రాష్ట్రంలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు చెందిన మున్సిపల్ కమిషనర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలెర్లతో పాటు సీనియర్ అధికారులతో కూడిన ఆరు బృందాలు ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జిహెచ్‌ఎంసిని సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు.