హైదరాబాద్

ఊపందుకున్న ‘స్వచ్ఛ’ ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: స్వచ్ఛ్భారత్ సాధనలో భాగంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో స్వచ్ఛ్భారత్ మిషన్ ప్రతి ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు జిహెచ్‌ఎంసి చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలపై ప్రజలను మరింత అవగాహన వంతులను చేసేందుకు ఆదివారం నాటి ప్రపంచ టాయిలెట్స్ డేను పురస్కరించుకుని మరిన్ని సరికొత్త స్వచ్ఛ కార్యక్రమాలకు బల్దియా శ్రీకారం చుట్టేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే నగరంలోని డంపర్ బిన్లు ఆకర్షనీయంగా కన్పించేలా అదనపు సొబగులను సమకూర్చింది. అలాగే కొద్దిరోజుల క్రితం నుంచి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చెత్త పడే ఖాళీ ప్రదేశాల్లో చెత్తను తొలగించి, పరిశుభ్రపరిచి అక్కడ ముగ్గులు వేసి, దీపాలతో అలంకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో పాటు కార్మికులకు వనభోజనాల నిర్వహణ, ఉత్తమ సేవలు అందించిన కార్మికులకు సన్మానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీంతో పాటు నగరంలో వందకు వంద శాతం ప్రతి ఇంటి నుంచి తడి,పొడి చెత్తను సేకరించేందుకు గాను స్వచ్ఛ యాత్రలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసి ఇంజనీర్లు, అధికారులు డంపింగ్ యార్డు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను నేరుగా తెల్సుకునే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అలాగే కార్మికులు మరింత శ్రద్ధతో, అంకితభావంతో పనిచేసేందుకు వీలుగా కార్మికుడి కంటి ఆపరేషన్‌కు ఆర్థిక సహాయాన్ని కూడా అందించి ప్రోత్సహిస్తోంది. ఉప్పల్ సర్కిల్‌లోని హబ్సిగూడ పారిశుద్ద్య కార్మికుడిగా పనిచేస్తున్న నక్రు క్రమం తప్పకుండా విధులకు హాజరవుతున్నందున ఆయన్ను అధికారులు సన్మానించటంతో పాటు ఆయనకు కాట్‌రాక్ట్ ఆపరేషన్ జరిగిన మరుసటి రోజే విధులకు హాజరుకావటంతో ఆయన అంకితభావాన్ని గుర్తించి, ఆయనకు రూ.22వేలను అందజేయనున్నట్లు ప్రకటించిన అధికారులు అప్పటికపుడు రూ. ఐదు వేలను అందజేశారు. దీంతో పాటు నగరాన్ని బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు గత కొంతకాలంగా పలు కార్యక్రమాలను చేపట్టిన బల్దియా ఇపుడు స్వచ్ఛ వాలంటీర్లను నియమించి, ఆ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేసింది. బహిరంగ మూత్ర విసర్జన వల్ల కలిగే అనారోగ్య పరిస్థితులను నగరంలోని పలు గోడలపై వాల్‌రైటింగ్ చేయించారు. దీనికి తోడు బహిరంగ మల,మూత్ర విసర్జనలు చేయరాదని ప్రజలకు ఏ రకంగానైతే చెబుతున్నారో, అదే క్రమంగా అవసరమైన చోట టాయిలెట్లను అందుబాటులోకి తెస్తున్నారు. సుమారు కోటి మంది జనాభా కల్గిన నగరంలో కేవలం వెయ్యి మాత్రమే టాయిలెట్లు ఉండగా, ప్రపంచ టాయిలెట్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మరిన్ని సమకూర్చేందుకు జిహెచ్‌ఎంసి చర్యలు చేపట్టింది.