హైదరాబాద్

నిరుద్యోగులతో టీఆర్‌ఎస్ చెలగాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్,నవంబర్ 18: తెరాస ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటం ఆడుతుందని తగిన మూల్యం చెల్లించక తప్పదని నిరుద్యోగ జెఎసి చైర్మెన్ కోటూరు మానవతారాయ్ పేర్కొన్నారు. శనివారం ఓయులో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ యెత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని అన్నారు. నిరుద్యోగుల త్యాగాలతో ఏర్పాటైన తెలంగాణలో నేడు వారిని అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ఓయు విద్యార్థులు అనేక త్యాగాలకు ఓర్చి తెలంగాణను సాధించుకున్నారని అన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణను చేస్తామని మాయమాటలు చెప్పి సామాజిక తెలంగాణకు తూట్లు పొడిచి నియంతృత్వ పోకడలతో దొరలరాజ్యానికి కెసిఆర్ నాంది పలుకుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తెరాస సర్కార్ విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు స్వస్తిపలకాల్సిన అవసరం ఉందని ఆయన హితవుపలికారు. రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని తెరాస సర్కార్ కళ్లు తెరిపిస్తామన్నారు.
గ్యాస్ లీకేజీతో చెలరేగిన మంటలు
ఖైరతాబాద్, నవంబర్ 18: సోమాజిగూడ డివిజన్ పరిధిలోని బీఎస్ మక్తాలో శనివారం ఉదయం మణికంఠ టిఫిన్ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్ లీకేజీ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి హోటల్ మొత్తం వ్యాపించాయి. హోటల్‌లోని ఇతర సామాగ్రికి మంటలు అంటుకోవడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురియ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినా ఫైర్ ఇంజన్లు రావడానికి ఆలస్యం కావడంతో బస్తీవాసులు నీళ్లు, మట్టి చల్లి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయాల పాలుకాగా ఎల్లమ్మ అనే కార్మికురాలు తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు.