హైదరాబాద్

ముంచుకొస్తున్న ప్రారంభ తేదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, నవంబర్ 19: ప్రజా రవాణ వ్యవస్థలో మరో మైలురాయిని సృష్టించనున్న మెట్రోరైలును ఈనెల చివరి వారంలో పరుగులు పెట్టించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అదే స్పీడ్‌తో పనులు కొనసాగుతున్నాయి. అనేక అడ్డంకులను దాటుకొని కీలక పనులు ముగిసినా సుందరీకరణ, స్టేషన్లలో వౌలిక వసతులు కల్పన వంటి పనులు పూర్తికాలేదు. వీటిని ప్రారంభ తేదీ లోపు పూర్తిచేయాలని అధికారులు ఎంతో హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే మెట్రో నడిచే రూట్లలో పాదచారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు గతంలో ఉన్న ఫుట్‌పాత్‌లను పూర్తిగా తొలగించి ఆ స్థానంలో అందమైన ఫుట్‌పాత్‌లను నిర్మిస్తున్నారు. ఈ పనులను జెట్‌వేగంతో పూర్తిచేయాలని భావించినా ఆశించిన స్థాయిలో పూర్తికావడం లేదు. రద్దీ ప్రాంతాల్లో పనులను సాగించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో తగినంత స్థలం అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు ఈ పనులకు అడ్డంకిగా మారుతున్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు, వికలాంగులు ఎలాంటి వారైనా సునాయాసంగా మెట్రోను వినియోగించుకునేలా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. చిన్నపాటి లోపం వచ్చినా అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండాల్సి వస్తుంది. దీంతో ఉన్నతాధికారులు క్రిందిస్థాయి సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. అధికారుల హడావుడి, సిబ్బంది ఇచ్చే సూచనల ప్రకారం పనులు చేసేందుకు కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు.
సాంకేతిక పరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి
ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే మెట్రోలో సాంతికేతిక పరమైన లోపాలు తలెత్తకుండా అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారు. వందలాది మందిని మోసుకు వెళ్లే రైళ్లలో చిన్నపాటి సమస్య పెనుప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉండటంతో ఈ అంశాలను చాలా సునిశితంగా పరిశీలిస్తున్నారు.
భద్రతకు ప్రాధాన్యం
మెట్రోస్టేషన్లలో భద్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకున్నది మొదలు గమ్యస్థానానికి చేరుకొని స్టేషన్ విడిచి వెళ్లే వరకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరితోపాటు రాష్ట్ర పోలీసుల సేవలను వినియోగించుకోనున్నారు.

వైద్య శిబిరం
కాచిగూడ, నవంబర్ 19: ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అంబర్‌పేట్ ఎమ్మెల్యే జీ.కిషన్ రెడ్డి అన్నారు. సీసన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ వైద్య శిబిరం బాగ్ అంబర్‌పేట్ దుర్గబాయ్ దేశ్‌ముఖ్ కాలనీలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కిషన్ రెడ్డి పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రపంచంలో చాల మంది ప్రజలు డయాబెటిక్‌తో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాగ్ అంబర్‌పేట్ కార్పొరేటర్ పద్మావతి, డీపీ రెడ్డి, బీజేపీ నాయకులు చుక్కా జగన్ పాల్గొన్నారు.