హైదరాబాద్

జనవరిలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ క్రికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌ల మాదిరిగా వచ్చే జనవరి మాసరంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించనున్నట్లు సిఎండి మనె్న గోవర్థన్‌రెడ్డి, సిఈఓ కుమార్ రాజా మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది టిపిఎల్ ప్రారంభించామని, ఈ సారి వివిధ జిల్లాల నుంచి మొత్తం 12 జట్లు బరిలో ఉంటాయని తెలిపారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువ క్రికెటర్లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో టిపిఎల్‌ను ప్రతి ఏటా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్రికెట్‌లో రాణించే సత్తా ఉన్నప్పటికీ చాలా మంది క్రీడాకారులకు సరైన ప్రోత్సాహాం లేదని, తమవంతు బాధ్యతగా తెలంగాణ నుంచి జాతీయ క్రికెట్ టీంలో చోటు కల్పించాలన్నదే తమ ప్రధాన సంకల్పం అని వివరించారు. తెలంగాణలో ప్రతిభ కల్గిన క్రీడాకారులెందరో ఉన్నారని, వారికి వేదిక కల్పించి అంచలంచెలుగా ఎదిగే అవకాశం కల్పించటమే తమ లక్ష్యమని వారు వివరించారు. హైదరాబాద్‌ను నాలుగు టీంలుగా విభజించామని, అందులో సైబరాబాద్ చాంపియన్ టీం నుంచి టివి, సినీ రంగాలకు చెందిన సెలబ్రిటీలు మ్యాచ్ ఆడనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రీమియర్ లీగ్ సీజన్‌కు ప్రముఖ క్రికెటర్, భారత క్రికెట్ టీం జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారించనున్నట్లు తెలిపారు. ఇటీవలే టిపిఎల్ లోగో, వెబ్‌సైట్, ప్రొమోసాంగ్‌ను అజహర్ చేతుల మీదుగా విడుదల చేసినట్లు తెలిపారు. సైబరాబాద్ చాంపియన్స్‌తో పాటు సికిందరాబాద్ వీనస్ లెవెన్, రంగారెడ్డి రాయల్స్, హైదరాబాద్ కింగ్స్, వరంగల్ రైడర్స్, కరీంనగర్ లెజెండ్స్, అదిలాబాద్ టైగర్స్, నిజాబాద్ నిజామ్స్, పాలమూరు పాంథర్స్, నల్గొండ నవాబ్స్, ఖమ్మం కమాండర్స్, మెదక్ లైన్స్ జట్లు పోటీ పడనున్నట్లు వారు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో డే అంట్ నైట్ మ్యాచ్‌లు జరుగుతాయని మనె్నగోవర్థన్ రెడ్డి వివరించారు.