హైదరాబాద్

హడ్కో నీటి ప్రాజెక్టు పనులపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: గ్రేటర్‌లో విలీనమైప్పటి నుంచి అరకొర వౌలిక వసతుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శివార్లకు తాగునీటిని అందించేందుకు రూ. 1900 కోట్ల హాడ్కో నిధులతో జలమండలి చేపట్టిన హాడ్కో, ఓఆర్‌ఆర్ తాగునీటి ప్రాజెక్టుల పనులను జలమండలి ఎండి దాన కిషోర్ మంగళవారం సమీక్షించారు. బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో ప్రస్తుతం ప్రాంతాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను ఆయన నిర్వహణ సంస్థలను అడిగి తెల్సుకున్నారు. పనులను మరింత వేగవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టులను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరమందన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా మంచినీటి శివార్లకు సరఫరా చేయగలిగితే చాలా వరకు శివార్లలోని నీటి సమస్య పరిష్కారమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షా సమావేశంలో జలమండలి ప్రాజెక్టు- డైరెక్టర్ ఎం.ఎల్లాస్వామీ, ప్రాజెక్టు-2 డైరెక్టర్ డి.శ్రీ్ధర్‌బాబుతో పాటు ప్రాజెక్టు విభాగం సిజిఎంలు, జిఎంలు, నిర్వహణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ నేత హత్య కేసులో
*ఆరుగురి అరెస్టు

హైదరాబాద్, నవంబర్ 21: టీఆర్‌ఎస్ నేత వల్లభనేని శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 16న రాత్రి సనత్‌నగర్ బస్టాండ్ వద్ద శ్రీనివాస్‌ను కొందరు దుండగులు తలపై బండరాళ్లతో మోది హత్య చేసిన ఘటన కలకలం రేపింది. హత్యకు గురైన శ్రీనివాస్ స్థానికంగా ప్రజాప్రతినిధిగా ఎదుగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను హత్యగావింపబడడం టీఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పాత కక్షలతోశ్రీనివాస్‌ను కొట్టి చంపినట్టు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. పరారీలో ఉన్న మరో నిందితుడు సాజిద్ కోసం గాలిస్తున్నామని, అతడు పట్టుబడితే గానీ హత్యకు గల కారణాలు పూర్తిగా తెలుస్తాయని పోలీసులు తెలిపారు.