హైదరాబాద్

మెట్రో రైలుకు హై సెక్యూరిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: ట్రాఫిక్ సమస్యతో ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్న మహానగరవాసులు ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరో వారం రోజుల్లో జంటనగరవాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా మెట్రోరైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయటంలో సర్కారు నిమగ్నమై ఉంది. అయితే తొలి దశగా కారిడార్ 1లోని మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు అలాగే నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు ఈ నెల 28వ తేదీన మెట్రోరైలు ప్రయాణం ప్రజలకు అందుబాటులోకి వస్తున్నందున, మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల భద్రతపై అధికారులు కాస్త ముందు నుంచే దృష్టి సారించారు. మెట్రోరైలు ప్రతిపాదనలు తయారు చేసిన;మారు పనె్నండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టు కాగితాలపై ఉన్నపుడే భద్రతకు పెద్దపీట వేశారు. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, మాడ్రన్ పోలీసింగ్‌ను ఇందుకు అనుసంధానం చేయనున్నారు. కొంతకాలం క్రితం దిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో మెట్రోరైలు ప్రతి భోగీలోని ప్రయాణికుల కదలికలను గమనించేందుకు ప్రతి కోచ్‌లోనూ సిసి కెమెరాలను ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిష్నరేట్‌ల పరిధుల్లో ఉన్న అన్ని మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేసిన, చేయనున్న ఈ సిసి కెమెరాలను మెట్రో స్టేషన్‌లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్‌తో పాటు అక్కడి నుంచి మెట్రోరైలు ప్రయాణించే అన్ని పోలీస్‌స్టేషన్లకు, అలాగే ఈ మూడు కమిష్నరేట్‌లలోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయనున్నారు. ప్రయాణికులు మెట్రో స్టేషన్‌లోకి వచ్చినప్పటి నుంచి మొదలుకుని కోచ్‌లో ప్రయాణిస్తున్నపుడు, అలాగే కోచ్ దిగి స్టేషన్ నుంచి బయటకు వెళ్లే వరకు కూడా నిఘా నేత్రాలు వారికి భద్రతను కల్పించేలా ఏర్పాటు చేశారు. అయితే ఈ నెల 28న ప్రారంభించాలనుకుంటున్న రెండు కారిడార్లలోని ఇంటర్ ఛేంజ్ స్టేషన్లు అయిన అమీర్‌పేట, ప్యారడైజ్ మెట్రో స్టేషన్లలో తొలి దశగా ప్రత్యేకంగా మెట్రోరైలు పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
2వేల 78 మంది పోలీసులతో భద్రత
మెట్రోరైలు భద్రతపై డిజిపి మహేందర్‌రెడ్డి, డిజిపి(రోడ్డ్భుద్రత) టి. కృష్ణప్రసాద్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది, మెట్రోరైలు ఎండి డా.ఎన్వీఎస్‌రెడ్డి, మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో కూడిన ఉన్నతాధికారులు బృందం ఇప్పటి వరకు రెండుసార్లు సమావేశమైంది. మెట్రో భద్రతపై కసరత్తు చేసింది. అయితే ప్రస్తుతం ప్రారంభిస్తున్న కారిడార్లలో భద్రత కోసం 2వేల 78 మంది పోలీసులను కేటాయించాలని మెట్రోరైలు అధికారులు డిజిపిని కోరారు. వీరిలో పోలీసు అధికారులు, హోంగార్డులు, ఎస్‌పిఓలుండగా, ప్రైవేటు సెక్యూరిటీని హైదరాబాద్ మెట్రోరైలు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. అలాగే మహిళలు, యువతులు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మహిళలను, యువతులను వేధించే ఆకతాయిల ఆటలు కట్టించేందుకు అన్ని మెట్రో స్టేషన్లలో షీ టీంలను ఏర్పాటు చేయాలని డిజిపి మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి తోడు అన్ని స్టేషన్లలోనూ క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్‌టి), బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(బిడిఎస్), డాగ్ స్క్వాడ్ వంటి భద్రతల బృందాలు కూడా అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.