హైదరాబాద్

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్కడపల్లి, నవంబర్ 23: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి అన్నారు. గురువారం చిక్కడపల్లి, ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను స్థానిక శాసన సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్, గాంధీనగర్ కార్పొరేటర్ ముఠా పద్మా నరేష్, రాంనగర్ కార్పొరేటర్ వి.శ్రీనివాస రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. బడ్జెట్‌లో ఎక్కువ శాతం సంక్షేమానికి కేటాయిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ అని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని, భక్తులు కూడా ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సూచించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి దేవాలయం మరింత అభివృద్ధి చెందేందుకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ కల్వకుంట జనార్దన్ రావు, డాక్టర్ పద్మజ, సాయిచరణ్, మల్లికార్జున్ సహకారంతో లిఫ్ట్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. అనంతరం ఆలయ ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో హేమంత్ కుమార్, నాయకులు దినేశ్, కల్వగోపి, పున్న సత్యనారాయణ, శ్రీకాంత్, నర్సింగ్ పాల్గొన్నారు.

నమ్మకంగా ఉంటూ చోరీకి పాల్పడ్డ డ్రైవర్ అరెస్టు
బేగంపేట, నవంబర్ 23: నమ్మకంగా పనిచేస్తూ భారీ చోరీకి పాల్పడి యజమానికే కుచ్చుటోపి పెట్టేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ను రాంగోపాల్‌పేట్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ సుధాకర్, ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన ముఖేష్ కుమార్ చాలాకాలం క్రితం నగరానికి వచ్చి గాంధీనగర్‌లో నివాసం ఉంటూ వ్యాపారి వినోద్‌కుమార్ వద్ద డ్రైవర్‌గా చేరాడు. నమ్మకంగా పని చేస్తుండటంతో వినోద్‌కుమార్ వినియోగదారులకు చెందిన బంగారు ఆభరణాలను ముఖేష్‌తో పంపించేవాడు. నిత్యం ఖరీదైన ఆభరణాలను, లక్షల కొద్ది నగదును మోసుకుపోతున్న ముఖేష్‌కు ఎంత కాలం పనిచేసినా జీవితంలో డబ్బు సంపాదించలేనని, ఒక్కసారి చోరీ చేసి హాయిగా బతికేద్దామని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులు సంతోష్ గౌడ్, విష్ణుతో కలిసి పథకం రచించాడు. బుధవారం రోజులాగే యజమాని ఇచ్చిన సరుకు, నగదును పట్టుకొని వినియోగారులకు అందించేందుకు బయలుదేరాడు. కొంత సేపటికి తిరిగి వచ్చి మధ్యలో కమర్షియల్ ట్యాక్ అధికారులమని చెప్పి నగదు, ఆభరణాలను తీసుకొని వెళ్లిపోయారని అమాయకంగా యజమానికి చెప్పాడు. వినోద్‌కుమార్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు డ్రైవర్ ముఖేష్‌పై అనుమానం వచ్చి అతని కథలికలను గమనించారు. అతని కాల్‌డేటాను పరిశీలించగా ముఖేష్ మరో ఇద్దరితో కలిసి చోరీ చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ముఖేష్‌ను అదుపులోనికి తీసుకొని విచారించడంతో తన స్నేహితులైన సంతోష్ గౌడ్, విష్ణు సహకారంతో చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. విష్ణు, సంతోష్‌లను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి చోరీకి గురైన నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.