హైదరాబాద్

‘పద్మావతి’పై తీవ్ర పరిణామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, నవంబర్ 23: రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసేలా నిర్మించిన వివాదాస్పద పద్మావతి చిత్రాన్ని తెలంగాణలో ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని శ్రీ రాజ్‌పుత్ కర్ణసేన హెచ్చరించింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సేన అధ్యక్షుడు లోకేందర్ సింగ్, ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. రాజ్‌పుత్ వంశస్థుల చరిత్రను వక్రీకరిస్తూ నిర్మాత సంజయ్ లీలా బన్సాల్ సినిమాను నిర్మించారని దుయ్యబట్టారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న పద్మావతిని తక్కువ చేసి సినిమాలో అభ్యంతకర సన్నివేశాలను పెట్టారని మండిపడ్డారు. చరిత్రను పూర్తిగా తెలుసుకొని వక్రీకరించకుండా చిత్రాన్ని నిర్మిస్తే తాము ఆహ్వానించే వారమని, దానికి విరుద్ధంగా సినిమాను తీశారని అన్నారు. సినిమాను నిషేదించాలని డిమాండ్ చేస్తున్న వారికి విదేశాల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని తెలిపారు. సంజయ్ లీలా వెనుక అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉన్నారేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. కొంత మంది కాంగ్రెస్ నేతలు సినిమాను సమర్ధించడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికే ఈ సినిమాను వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శించమని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని చెప్పారు. అదే తరహాలో ఇక్కడ సైతం ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విన్నవించినట్టు పేర్కొన్నారు. విరుద్ధంగా ప్రదర్శిస్తే రాజ్‌పుత్‌ల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని అన్నారు.