హైదరాబాద్

హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, నవంబర్ 23: ఓవైపు దేశ ప్రధాని మరో వైపు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక నగరానికి రానున్న నేపథ్యంలో నగరం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ప్రతిష్టాత్మక మెట్రోరైలును ప్రారంభించేందుకు దేశ ప్రధాని మోదీ, నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు ఇవాంక హాజరవుతున్నారు. దీంతో నగరంలోని భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సాధారణ రోజుల్లోనే గస్తీ నిర్వహించే పోలీసులు గస్తీని మరింత ముమ్మరం చేశారు. మహానగర పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయా పోలీస్‌స్టేషన్ల వారీగా ఉన్న ప్రాంతాలు, పాత నేరస్థుల వివరాలతో పాటు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చిన్నపాటి సంఘటన సైతం చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ప్రధాని, ఇవాంకలు ప్రయాణించే మార్గాలతో పాటు అన్ని రూట్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అమెరికా భద్రతా దళాలు, దేశ రక్షణ దళాలు, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం భద్రత విధుల్లో ఉన్నారు. ఇందులో భాగంగా నగరంలోని బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లపై దృష్టిసారించిన భద్రతా అధికారులు ప్రతి ప్రయాణికుడినీ నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుమానితులను అదుపులోనికి తీసుకొని పూర్తి వివరాలను సేకరించిన అనంతరమే వారిని వదలివేస్తున్నారు.