హైదరాబాద్

మెట్రోరైలుతో ‘మరింత స్పీడ్ ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఖైరతాబాద్, డిసెంబర్ 5: మహానగరవాసులకు కొద్దిరోజుల క్రితం అందుబాటులోకి వచ్చిన మెట్రోరైలుతో ప్రజారవాణా వ్యవస్థ మరింత వేగవంతమైంది. గతంలో నాగోల్ నుంచి మియాపూర్ వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే కనీసం గంట నుంచి గంటన్నర సమయం పట్టేది. కానీ మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి నిరీక్షణ, ప్రయాణంలో కుదుపు వంటివేమీ లేకుండా ప్రజారవాణ వ్యవస్థ మరింత స్పీడ్ కావటం పట్ల నగరవాసుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్ధీగా ఉండే ప్యారడైజ్, సికందరాబాద్ ఒలిఫెంటా బ్రిడ్జి వంటి ప్రాంతాల్లో మూడంచెల అరుదైన ప్రజారవాణా వ్యవస్థ ఆవిష్కృతమైంది. మెట్రో రైలు ప్రారంభంతో నగరంలోని ప్రజారవాణ వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారాయి. ముఖ్యంగా నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు 17కిలోమీటర్లు, మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు 13 కిలోమీటర్ల పొడువున అత్యంత ట్రాఫిక్ కారిడార్‌కు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేరకున్న ప్రాంతాల ప్రజలు మెట్రోను ఎంతో చక్కగా వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు రోడ్డు, రైలు మార్గాల ద్వారానే ప్రయాణాన్ని చూసిన నగరవాసులు అల్లంత ఎత్తున్న ఎలాంటి శబ్దం లేకుండా సాగే మెట్రో పరుగులతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక, ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు, మన దేశంలో మెట్రోను అందుబాటులోకి తెచ్చుకున్న నగరాలను సందర్శించలేని పేద, మధ్య తరగతి ప్రజలు మెట్రోరైలు ప్రయాణంతో ఆ అనుభూతిని పొందుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రీకాస్ట్ పద్ధతిలో మెట్రో నిర్మాణం జరిగింది. నానాటికి నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను దూరం చేయటంతో పాటు, ఆధునిక రవాణ వ్యవస్థను అందించాలన్న లక్ష్యంతో మెట్రోరైలు పనులు ఆద్యంతం ప్రపంచస్థాయి సాంకేతిక ప్రమాణాలతో కొనసాగుతున్నాయి. నడిరోడ్డుపై ఫిల్లర్లను నిర్మించి, దానిపై ఎక్కువ విస్తీర్ణంలో మెట్రో స్టేషన్లు, కారిడార్‌ను నిర్మించటంతో పలు ప్రాంతాల వ్యూ మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటి పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ ప్రాజెక్టుగానే గాక, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రమాదరహిత ప్రాజెక్టుగా కూడా మెట్రో పేరుగాంచింది. నగరంలో చాలా చోట్ల ఇరుకైన రోడ్లు, నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై రాత్రులు భారీ యంత్రాలతో నిర్మాణాలు జరుపుకుంది మెట్రో. దీనికి తోడు పలు చోట్ల రైల్వే బ్రిడ్జ్‌లు, ఫ్లై ఓవర్లు ఉండటంతో ఆయా ప్రాంతాల్లో మూడెంచల రవాణ వ్యవస్థ ఆవిష్కృతం అయింది. గతంలో నిర్మించిన బ్రిడ్జ్‌లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంజనీరింగ్ నైపుణ్యానికి పదును పెట్టి బ్రిడ్జ్‌లపై బ్రిడ్జ్‌లను ఏర్పాటు చేసి నిర్మాణ రంగంలో మెట్రో నూతన అధ్యాయనానికి నాంది పలికింది. ఇలా నిర్మాణం జరుపుకున్న వాటిలో మెట్టుగూడ, అలుగడ్డ బావి వద్ద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్. కింద్ర రోడ్డు మార్గం గుండా వాహనాల రాకపోకలు, ఆపైన సాధారణ రైళ్ల రాకపోకలపై మెట్రోపరులు సాగించేలా ఓలిఫెంటా బ్రిడ్జి వద్ద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాలను ఉదాహారణలుగా చెప్పవచ్చు. అదే విధంగా పంజాగుట్ట ప్రాంతంలో క్రింద రోడ్డు, దానిపై ఫ్లై ఓవర్, ఆపైన మెట్రో లైన్ ఎంతో ఆకర్షనీయంగా కన్పిస్తోంది. అన్నీ మెట్రో స్టేషన్లలో కావల్సిన స్థాయిలో పార్కింగ్ సౌకర్యాన్ని సైతం అందుబాటులోకి తీసుకువస్తే చాలా మంది మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉంటుంది.