హైదరాబాద్

బహుముఖ ప్రజ్ఞాశాలి.. రాజశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, డిసెంబర్ 7: ప్రముఖ నటి రాజశ్రీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని లోకాయుక్త జస్టిస్ బీ.సుభాషణ్ రెడ్డి అన్నారు. రాజశ్రీకి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు కళానిలయం సిల్వర్ క్రౌన్ ప్రదానోత్సవ కార్యక్రమం కళానిలయం సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో గురువారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ సుభాషణ్ రెడ్డి రాజశ్రీకి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు సిల్వర్ క్రౌన్‌ను ప్రదానం చేశారు. విభిన్న పాత్రలలో రాజశ్రీ నటించి నటనకు వనె్న తెచ్చారని కీర్తించారు. నటనలో జీవించి ప్రేక్షకులను మెప్పించారని పేర్కొన్నారు. ఆమెకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. సభకు ముందు చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కాచం సినీ క్రియేషన్ అధ్యక్షుడు కాచం సత్యనారాయణ గుప్త, లయన్ విజయ్ కుమార్, ప్రతాని రామకృష్ణ గౌడ్, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, ప్రముఖ నటి కవిత, కొత్త కృష్ణవేణి, డా. ఏభూషి యాదగిరి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.సురేందర్, ఎ.పుష్పలత పాల్గొన్నారు.
ఘంటసాల పురస్కారం ప్రదానం
కాచిగూడ, డిసెంబర్ 7: ఘంటసాల ఆరాధనోత్సవాల్లో భాగంగా యోగి టీవీ ప్రతినిధి సుధాకర శర్మకు సద్గురు ఘంటసాల ధర్మజ్ఞాన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి లయన్ విజయ్ కుమార్, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, కొత్త కృష్ణవేణి, తెనే్నటి సుధాదేవి పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. సభకు ముందు గాయకులు వినోద్ బాబు, వెంకట్రావు, సురేఖా మూర్తి, గీతాంజలి, అనురాధ అలపించిన గీతాలు అందరినీ అలరించాయి.
అలరించిన సినీ సంగీత విభావరి
ప్రముఖ గాయకుడు కృష్ణ కుమార్ నిర్వహణలో సినీ సంగీత విభావరి శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి డా. ఏభూషి యాదగిరి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, డా. కేవీ. రమణ, బింగి నరేందర్ గౌడ్ పాల్గొని గాయకులను అభినందించారు. సభకు ముందు కృష్ణ కుమార్ బృందం అలపించిన సినీ సంగీత విభావరి అందరినీ అలరించాయి.
అలరించిన అన్నమయ్య సంకీర్తనలు
కాచిగూడ, డిసెంబర్ 7: శివశక్తి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ, శ్రీ త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనార్చన కార్యక్రమం గురువారం గానసభలోని కళా వేంకట దీక్షితుల కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి కూచిపూడి నృత్య గురువు డా. పసుమర్తి శేషుబాబు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, గురుదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు. సభకు ముందు చిన్నారులు అలపించిన అన్నమాచార్య కీర్తనలు అందరినీ అలరించాయి.

ఆర్థిక అసమానతల ఆధారంగా
రిజర్వేషన్లను అమలు చేయాలి
* టీఆర్‌ఈపీఏ డిమాండ్
ఖైరతాబాద్, డిసెంబర్ 7: ఆర్థిక అసమానతల ఆధారంగా రిజర్వేషన్లు అమలుచేసినప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందని తెలంగాణ రెడ్డి ఎంప్లాయాస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (టీఆర్‌ఈపీఏ) డిమాండ్ చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షురాలు భాగ్యరేఖ మాట్లాడారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు అవుతుండటంతో ఉన్నత వర్గంలోని పేదల మరింత పేదలుగా మిగిలి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కులం ప్రాతిపాదికన ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకోలేని అనేకమంది సమాజంలో అట్టడుగుకు చేరుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నతవర్గాల్లో ఎంతోమంది కడుపునిండా తినలేని వారు ఉన్నారని వారి గురించి ప్రభుత్వాలు ఆలోచించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకులాల్లో ఓసీలకు కేవలం ఒక్కశాతం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఆయా కులాల్లోని పేదలు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో భాస్కర్ రెడ్డి, సంతోష్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీలతరెడ్డి తదిరులు పాల్గొన్నారు.

ఎగ్జిబిషన్లతో చే‘నేత’కు ఆర్థిక పరిపుష్టి
ఖైరతాబాద్, డిసెంబర్ 7: నగరంలో కొలువుదీరుతున్న ఎగ్జిబిషన్లతో చేనేతకళాకారులకు ఎంతగానో ప్రోత్సాహం లభిస్తుందని వర్ధమాన తార నేహాదేశ్ పాండే అన్నారు. గురువారం తాజ్‌కృష్ణలో ఏర్పాటుచేసిన ట్రెండ్జ్ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేతివృత్తిదారులు తాము ఉత్పత్తి చేసిన వస్తువులను నేరుగా విక్రయించుకునే అవకాశం ఎగ్జిబిషన్లతో లభిస్తుందని తెలిపారు. దీంతో వారు ఆర్థికంగా బలపడటంతో పాటు నగర వినియోగదారుల అభిరుచులను తెలుసుకొని అందుకు అనుగుణంగా వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోగలుగుతారని అన్నారు. ఈనెల 9 వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు రూపొందించిన వస్త్రాలను అందుబాటులో ఉంచినట్టు నిర్వాహకురాలు శాంతి తెలిపారు.