హైదరాబాద్

ఆరుగురు ఘరానా దొంగల అరెస్టు ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి: మూడేళ్ల క్రితం భారీ చోరీకి పాల్పడి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న ఆరుగురు ఘరానా దొంగలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు ఇంటి తాళాలు పగలగొట్టి నగదు దోచుకుపోయే మరో ఐదుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండున్నర కోట్లు విలువచేసే 5.7 కేజీల బంగారు ప్లాటినం డైమండ్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ నిందితుల వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన జలాం మహేష్‌రెడ్డి అలియాస్ చిట్టిబాబు (24), కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో నివాసముంటున్న సైబర్ యెడోస్ కాలనీలో ఎన్‌ఆర్‌ఐ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సైబర్ యెడోస్ కాలనీలోని విల్లా నెంబర్ 70 నివాసముండే ఎన్‌ఆర్‌ఐ శివప్రసాద్‌రెడ్డి 2014 మార్చి నెలలో కుటుంబ సభ్యులతో ఆఫ్రికా దేశం వెళ్లారు. విల్లా నెంబర్-47, 70 రెండూ పక్కనే ఉండడంతో వీరిద్దరు ఖాళీ సమయంలో మాట్లాడుకుంటుండేవారు. శివప్రసాద్‌రెడ్డి పక్క విల్లా డ్రైవర్‌తో మాట్లాడుతున్న సమయంలో తమ యజమాని శివప్రసాద్ రెడ్డి ఆఫ్రికా వెళ్లారని ఓ సందర్భంలో అన్నాడు. అది గ్రహించిన మహేష్‌రెడ్డి మరుసటి రోజు శివప్రసాద్ రెడ్డి ఇంట్లోకి కిటికిలోనుండి లోపలికి వెళ్లి స్ట్రాంగ్ రూమ్ తెరచి అందులో ఉన్న ప్లాటినం డైమండ్స్ పొదిగిన నగలు బంగారు ఆభరణాలు తీసుకువెళ్ళిపోయాడు. ఆఫ్రికా వెళ్లి వచ్చిన శివప్రసాద్‌రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులకే పోలీస్ స్టేషన్ పరిధులు మార్చిన సమయంలో కొండాపూర్, గచ్చిబౌలి పోలీసుస్టషన్‌కి రావడం దొంగలు దొరకకపోవడంతో కేసును సిసిఎస్‌కు బదిలీ చేశారు.
50 మంది అనుమానితులను ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు గురించి మరిచిపోయారనుకుని మహేష్‌రెడ్డి ఆభరణాలను బయటకు తీయసాగాడు. ఈ మధ్యకాలంలో జరిగిన ఫంక్షన్‌కి నిందితుని భార్య వడ్డాణంతో పాటు నగలు ధరించుకుని వెళ్ళింది. డ్రైవర్ భార్య ఖరీదైన నగలు ధరించడంతో పోలీసులకు ఉప్పందించారు.
మాదాపూర్ సిసిఎస్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. మొదట తను కష్టపడి సంపాదించుకున్నానని బొంకినా తరువాత ఒప్పుకోక తప్పలేదు. నిందితుడి నుండి 2.24 కోట్ల రూపాయల విలువచేసే 4.3 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సిపి వివరించారు. ఎల్బీనగర్ సిసిఎస్ అబ్దుల్‌జఫర్ (43) మల్లిగొట్ల ఐశ్రీమేలు (34)ను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 102 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై సైబరాబాద్‌లో 13 కేసులున్నాయని ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ చేయడంతో దిట్టని సిపి ఆనంద్ వివరించారు.
బాలానగర్ సిసిఎస్ పోలీసులు ముగ్గురి నిందితులను అరెస్టుచేసి 37 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గోపాల్ (26), గొల్లకృష్ణ (29), గొల్ల శంకర్‌లు మెదక్ పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో నాలుగు కేసులలో నిందితులని సిపి వివరించారు. గత ఏడాదితో పోల్చితే 39 శాతం దొంగతనాలు తగ్గినట్లు సిపి వెల్లడించారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకోవడంతో పాటు సొత్తు రికవరికి కృషి చేసిన పోలీసు అధికారులకు, సిబ్బందికి సిపి క్యాష్ అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో డిసిపి క్రైం నవీన్‌కుమార్, అడిషనల్ డిసిపి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఎసిపిలు పాల్గొన్నారు.