హైదరాబాద్

విశ్వవ్యాప్తంగా అన్నమయ్య కీర్తనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, డిసెంబర్ 10: భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ట్స్ కల్చర్ సంయుక్తంగా ‘శ్రీశ్రీశ్రీ అన్నమయ్య స్వర నీరాజనం’ కార్యక్రమం ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. తెలుగు ప్రపంచ రికార్డు సాధన కోసం 303 గాయకులు, 303 నిమిషాల పాటు అన్నమయ్య స్వర నీరాజనం పేరిట వివిధ అన్నమయ్య సంకీర్తనలు అలపించి తెలుగు ప్రపంచ రికార్డులో స్థానం సంపాధించుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఏఎస్ రామచంద్రుడు పాల్గొన్నారు. అన్నమయ్య సంకీర్తనలు విశ్వ వ్యాప్తం చేయడానికి ఎంతో మంది శిష్యులను తయారు చేసి దేశవిదేశాలలో అనేక కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. పద్మశ్రీ డా.శోభారాజుకు భారత్ వరల్డ్ రికార్డ్సుచే జీవిత సాఫల్య పురస్కారంతో పాటు వివిధ రంగల్లో విశిష్ట సేవలందించిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడి నారాయణ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ దామోదర్ గుప్త, రాంమోహ్మన్, విజయలక్ష్మీ, సంస్థ అధ్యక్షుడు డా.లయన్ కేవీ రమణ రావు, డా.లయన్ లలితా రావు పాల్గొన్నారు.

‘అమెరికా - కట్టుకథలూ - కమామీషులూ’ పుస్తకావిష్కరణ
కాచిగూడ, డిసెంబర్ 10: ప్రముఖ రచయిత వంగూరి చిట్టెన్ రాజు రచించిన ‘అమెరికా కట్టు కథలూ - కమామీషులూ’ పుస్తకావిష్కరణ సభ చిక్కడపల్లి హైదరాబాద్ స్టడీ సర్కిల్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నవ్య వార పత్రిక సంపాదకుడు జగన్నాథ శర్మ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. చిట్టెన్ రాజు రచనలు ఎంతో హస్యన్ని పండిస్తాయని పేర్కొన్నారు. హస్య రచనలతో పాటు హృదయాన్ని కదిలించే రచనలు చేశారని తెలిపారు. రచనల ద్వారా హస్యం పండించడం ఎంతో కష్టమని, చిట్టెన్ రాజు 100 హస్య పుస్తకాలను రచించారని కీర్తించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి సుధామ, నల్లమోతు శ్రీ్ధర్, జ్యోతి పాల్గొన్నారు.

విన్నకోట మురళీకృష్ణకు పురస్కారం ప్రదానం
కాచిగూడ, డిసెంబర్ 10: ప్రముఖ లలిత సంగీత దర్శకుడు విన్నకోట మురళీకృష్ణకు సద్గురు ఘంటసాల ‘చిత్రద్యుతి’ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ ఘంటసాల ఇంటర్నేషనల్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జయ జయ శంకర టీవీ సీఈఓ డా.ఓలేటి పార్వతీశం పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. లలిత సంగీతంలో గత ఐదు దశాబ్దాలుగా విన్నకోట మురళీకృష్ణ సేవలందిస్తున్నారని కీర్తించారు. సభకు ముందు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ‘పెళ్లి చేసి చూడు’ చిత్ర పదర్శనను ప్రదర్శించారు. కార్యక్రమంలో వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ఎంవి రాఘవా చార్య, రాజేంద్ర ప్రసాద్, జయశ్రీ పాల్గొన్నారు.

గంజాయి సరఫరా: ఇద్దరి అరెస్టు
నేరేడ్‌మెట్, డిసెంబర్ 10: గుట్టుచప్పుడు కాకుండా గంజాయి, హెరాయిన్ సరఫరా చేస్తూ విక్రయిస్తున్న ఇద్దరి వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌కు చెందిన ఆజనా దశరథ్ గాయేరి(32), రమేష్ చాంద్(42) రాజస్థాన్ నుండి గంజాయి, హెరాయిన్ తీసుకువచ్చి విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం నేరేడ్‌మెట్ చౌరస్తాలో గంజాయి తీసుకువెళ్తున్న ఇద్దరి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పారు. వెంటనే నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 56 కేజీల హెరాయిన్, కిలో 50గ్రాముల ఓపియం సీజ్ చేసినట్టు ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్ సింగ్ తెలిపారు.