హైదరాబాద్

13న సరూర్‌నగర్ స్టేడియంలో లంబాడా శంఖారావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 10: తెలంగాణ లంబాడీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 13న సరూర్‌నగర్ స్టేడియంలో లంబాడాల శంఖారావాన్ని నిర్వహిస్తున్నట్టు ఐక్య వేదిక నాయకుడు రామ్‌చందర్ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పోస్టర్‌ను సురేష్ నాయక్, సంజీవ్ నాయక్‌లతో కలిసి ఆవిష్కరించారు. కొంత మంది రాజకీయ నాయకులు ఉద్ధేశ్యపూర్వకంగా గిరిజన తెగల మధ్య చిచ్చుపెడుతున్నారని దుయ్యబట్టారు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న ఆదివాసి, బంజారాల మధ్య చిచ్చుపెట్టి తమాషా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులైన ఆదివాసీ కులాలైన గోండు, కోయ తదితర వర్గాల ప్రజలు అకారణంగా లంబాడి మహిళలు, చిన్నారులపై దాడులు తెగబడేలా రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సమావేశంలో వెంకటేష్ చౌహాన్, గణేష్ నాయక్, నెహ్రూ నాయక్, శంకర్ నాయక్, బిచ్చు పాల్గొన్నారు.
లంబాడా శంఖారావంతో సత్తాచాటుతాం
సైదాబాద్: గిరిజనుల ఐక్యతను, శక్తిని విచ్చిన్నం చేయాలని కుట్ర పన్నుతున్న ద్రోహులకు తగిన గుణపాఠం చెబుతామని సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ అన్నారు. ఆదివారం ఐఎస్‌సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మోతీలాల్ మాట్లాడుతూ 25లక్షల మంది లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ద్రోహులకు లంబాడాల శక్తిని తెలియజేస్తామని తెలిపారు. ఈనెల 13న సరూర్‌నగర్ స్టేడియంలో ఐదు లక్షల మందితో తెలంగాణ లంబాడాల శంఖారావం నిర్వహిస్తున్నామని తెలిపారు.