హైదరాబాద్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అగ్రస్థానంలో నిలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: స్వచ్ఛ్భారత్ సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీహెచ్‌ఎంసీని అగ్రస్థానంలో నిలపటంలో కమ్యూనిటీ రీసోర్సు పర్సన్స్‌దే కీలక పాత్ర అని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ సూచించారు. ప్రతి ఇంటి నుంచి తడి,పొడి చెత్త వేర్వేరుగా ఆటోటిప్పర్ కార్మికులకు అందేలా, వారిలో అవగాహనను పెంపొందించే ముఖ్యమైన బాధ్యత సీఆర్‌పీలపైనే ఉందని కూడా ఆయన గుర్తుచేశారు. తడి,పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్వచ్ఛదూత్‌లుగా నియమించిన సీఆర్‌పీలకు సోమవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదూత్‌లతో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సామజిక కార్యకర్తల విధానం ఇతర ఏ నగరాల్లో కూడా లేదని, ఇది దేశానికే ఆదర్శనీయం అన్నారు. ప్రతి ఇంటిలో నుంచి చెత్త తడి,పొడిగా వేర్వేరుగా వచ్చేందుకు వీలుగా ఇప్పటికే 44 లక్షల డస్ట్‌బిన్లను పంపిణీ చేయటంతో పాటు చెత్తను సేకరించి, ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు తరలించేందుకు దేశంలో ఏ నగరంలో లేని విధంగా 2వేల ఆటో టిప్పర్లను సమకూర్చటం కూడా దేశంలోనే మొదటి సారి ఆయన వివరించారు. రోడ్లపై చెత్తను వేయటం వల్ల స్వచ్ఛ హైదరాబాద్‌కు విభాగం కలగటంతో పాటి అనారోగ్యం పాలవుతామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను వేరు చేసి ఆటోకార్మికులకు అందజేయటం ద్వార స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో జీహెచ్‌ఎంసీ అగ్రస్థానంలో నిలిచే అవకాశముందన్న విషయాన్ని ప్రజలు కూడా గుర్తించి, ఆ దిశగా తమవంతు సహాకారాన్ని అందించాల్సిన అవసరముందన్నారు.
సీఆర్‌పీలు తమకు కేటాయించిన ఇళ్లలో వంద శాతం రిక్షా కార్మికులకు చెత్తను అందించేలా ఫలితాలు సాధిస్తేనే తగు పారితోషికం అందించటం జరుగుతుందని అధికారులు సీఆర్‌పీలకు స్పష్టం చేశారు. ఈ స్వచ్ఛదూత్‌లు ఇపుడు వారికి నిర్దేశించిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తే మున్ముందు మరెన్నో ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం దక్కుతుందని వివరించారు. తడి,పొడి చెత్తపై రూపొందించిన కరపత్రాన్ని ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ భాస్కరచారి, జోనల్ కమిషనర్ రఘు, అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

జడ్పీ భవన నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయాలి

హైదరాబాద్, డిసెంబర్ 11: రంగారెడ్డి జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి మహెందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రూ.10 కోట్ల నిధులతో 81991 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న మూడంతస్థుల భవన సముదాయాన్ని పరిశీలించారు. సెల్లార్ ఏరియాను, గ్రౌండ్ ఫ్లోర్‌లో 600 మందికి సరిపడా భోజనశాలను, మొదటి అంతస్థులోని చైర్‌పర్సన్ గది, 192 మంది సభ్యులు కూర్చోడానికి వీలుగా నిర్మితమైన మెయిన్ కాన్ఫరెన్స్ హాల్, 20 మంది కూర్చోవడానికి వీలుగా మినీ కాన్ఫరెన్స్ హాల్, సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఏవో, మిగతా ఆఫీస్ సిబ్బందికి నిర్మించిన గదులను తిరిగి చూసి నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. భవనంలో అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మూడవ అంతస్థులో చేపట్టవలసిన నిర్మాణ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని, దానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని అన్నారు. జిల్లా పరిషత్ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ఈనెల 13న ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఈవో రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.