హైదరాబాద్

మానవ హక్కులను పరిరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, డిసెంబర్ 11: మానవ హక్కులను పరిరిక్షించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని వైజ్‌మెన్ క్లబ్ పూర్వక్షేత్రధికారి వైఎస్‌ఆర్ మూర్తి అన్నారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమం వైజ్‌మెన్ క్లబ్ ఆఫ్ సికిందరాబాద్ ఆధ్వర్యంలో సోమవారం హైదర్‌గూడలో నిర్వహించారు. వివిధ రంగల్లో విశిష్ట సేవలందించిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అనురాధ, లిఖితా నాయుడు, గోపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, డా.సాధిక్ పాల్గొన్నారు.
చంద్రతేజకు పురస్కారం ప్రదానం
కాచిగూడ, డిసెంబర్ 11: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు చంద్ర తేజకు సద్గురు ఘంటసాల చిత్రద్యుతి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ ఘంటసాల ఇంటర్నేషనల్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, లయన్ విజయ్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, డా.తెనే్నటి సుధాదేవి పాల్గొని చంద్ర తేజకు పురస్కారం ప్రదానం చేశారు. సభకు ముందు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ‘లవకుశ’ చిత్ర ప్రదర్శనను ప్రదర్శించారు.

సమాజ సేవలో భాగస్వాములు కావాలి
కాచిగూడ, డిసెంబర్ 11: ప్రముఖ సంఘ సేవకురాలు కొత్త కృష్ణవేణి ఇండియన్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా అభినందన సభ శిఖరం ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ పాల్గొని కొత్త కృష్ణవేణిని అభినందించి సత్కరించారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అకాక్షించారు. కొత్త కృష్ణవేణి చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ ప్రదానం చేయడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. కార్యక్రమంలో రచయిత్రి హైమవతి భీమన్న, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, వైఎస్‌ఆర్ మూర్తి పాల్గొన్నారు.

అలరించిన ‘స్వర-హారం’
కాచిగూడ, డిసెంబర్ 11: ఘంటసాల జయంతి సందర్భంగా ‘స్వర - హారం’ పేరిట సినీ సంగీత విభావరి జిఎస్ రామకృష్ణ మిత్ర మండలి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, రచయిత తంగిరాల చక్రవర్తి, సుధాకర శర్మ, గాయకుడు బాల కామేశ్వర రావు, సంస్థ అధ్యక్షుడు జియస్ రామకృష్ణ పాల్గొని గాయకులను అభినందించారు. సభకు ముందు గాయనీ, గాయకులు అలపించిన సినీ సంగీత విభావరి అందరిని అలరించాయి.