హైదరాబాద్

భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేక వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: మహానగరంలో చెత్తను సేకరించి, సకాలంలో డంపింగ్ యార్డుకు తొలగించేందుకు ఎంత సమర్థవంతంగా విధులు నిర్వర్తించినా, భవన నిర్మాణ వ్యర్థాలు అనేవి అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఈ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి మళ్లీ నిర్మాణ సామాగ్రిని తయారు చేసేందుకు బల్దియా సిద్ధమైంది. దీంతో ఈ ప్రక్రియ ద్వారా తిరిగి భవన నిర్మాణ సామాగ్రిని తయారు చేసే నగరాల సరసన హైదరాబాద్ కూడా చేరింది. ఇందుకు గాను నగరంలో ఎక్కడబడితే అక్కడ ఈ వ్యర్థాలను వేయకుండా ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. తొలి దశగా అందుబాటులోకి వచ్చిన వాహనాలను మంగళవారం మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. అంతేగాక, వీటిని రీ సైక్లింగ్ చేసేందుకు రెండు ప్లాంట్ల ఏర్పాటుకు సైతం రెండు చోట్ల స్థలాలను గుర్తించారు. ఈ వాహనాలను కేవలం భవన నిర్మాణ వ్యర్థాలను మాత్రమే ఫతుల్లాగూడ, జీడిమెట్లలో ఏర్పాటు చేసిన ప్లాంట్లకు తరలించనున్నాయి.
వాహనం కావాలంటే రెండు మార్గాలు
కొత్తగా నిర్మాణం చేపట్టేవారు ప్రస్తుతమున్న కట్టడాలను కూల్చివేసి, ఇష్టారాజ్యంగా పారవేస్తుంటారు. అలా కాకుండా కూల్చివేతలు పూర్తి కాగానే ఆ భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్ నెంబరు 21111111కు గానీ, మై జీహెచ్‌ఎంసీ యాప్‌కు గానీ సందేశం పంపి, సకాలంలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేలా సహకరించాలని అధికారులు కోరుతున్నారు. యాప్ ద్వారా భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు ఈ వాహనాలు అవసరమైన వారు ప్రతి టన్ను డెబ్రీస్‌కు రూ. 342ను యూజర్ ఛార్జీలుగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సీ అండ్ డీ ప్లాంట్లు ప్రారంభమయ్యేలోపు నగరంలోని వ్యర్థాలను ఫతుల్లాగూడ, జీడిమెట్ల ప్రాంతంలో డంపింగ్ చేయనున్నారు. అయితే భవన నిర్మాణ వ్యర్థాలలో రోజు వెలువడే మున్సిపల్ చెత్తను కలవకుండా వీటిని వేరుగా సేకరించేందుకు ప్రత్యేకంగా వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
రీ సైక్లింగ్‌లో మనది నాలుగో స్థానం
భవన నిర్మాణ వ్యర్థాలను ప్రత్యకంగా సేకిరంచి, వాటి నుంచి తిరిగి భవన నిర్మాణ సామాగ్రి అయిన ఇటుకలు, ఇసుకను తయారు చేసే రీ సైక్లింగ్ విధానంలో దేశంలో నగరం నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఈ ప్రక్రియను దిల్లీ, నాగ్‌పూర్, అహ్మదాబాద్ నగరాలుండగా, ఇపుడు వాటి సరసన మన నగరం కూడా చేరింది. ప్రస్తుతం నగరంలో నాలుగు సీ అండ్ డీ ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాలను సేకరించినా, వీటి సంఖ్య మున్ముందు మరింత పెంచాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ రెవెన్యూ జిల్లాలకు చెందిన ప్రాంతాల నుంచి ప్రతిరోజు 450 టన్నుల మెట్రిక్ టన్నుల డెబ్రీస్ తొలగింపు, రీ సైక్లింగ్ ప్రక్రియలను చేపట్టి ఆదాయ వనరుగా మలిచేందుకు జీహెచ్‌ఎంసీ చేస్తున్న కృషి ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి!