హైదరాబాద్

తెలుగు మహాసభలలో తెలంగాణ ఖ్యాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొని తెలంగాణ ఖ్యాతిని పెంచాలని రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం జడ్పీ సమావేశం మందిరంలో ప్రపంచ తెలుగు మహా సభల అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి కవి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. జిల్లా కవులను ఆహ్వానించి కవి సమ్మేళనం జరుపుకోవడం సంతోషకరమన్నారు. పూర్వ కవులను స్మరించుకుంటూ మారుతున్న కాలానుకనుగుణంగా కవులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలని పేర్కొన్నారు. కలెక్టర్ రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లో 15 నుంచి 19వ తేదీ వరకు జరిగే ప్రపంచ తెలుగు మహా సభలకు జిల్లా యంత్రాంగం ప్రతి మండలం నుంచి బస్సు సౌకర్యాన్ని కల్పిస్తుందని అన్నారు. కవి సమ్మేళనంలోని కవితలను విన్న తర్వాత కార్యాలయ పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందిన అనుభూతి కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. డీఆర్‌డీఓ భవానీ శంకర్ మాట్లాడుతూ తెలుగు మహాసభలను నిర్వహించడంతో సాహితీ వికాసంలో తెలంగాణ మహాత్తర కృషి లోకానికే చాటి చెప్పుతూ తెలంగాణ సాహిత్య వైభవాన్ని, మహా కవుల విశేష ప్రతిభను ప్రంచం దృష్టికి తేవాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రాజేశ్వర్ రెడ్డి, కవులు దొరవీటి చెన్నయ్య, వేలేటి మోహన్, రామకృష్ణ రాజు, ఆకుల మల్లికార్జున్, ఆశీర్వాదం, హన్మంత్‌రెడ్డి, కృష్ణ స్వామి, పరమేశ్వర్, వెంకట స్వామి, మహేశ్వర్ రెడ్డి, దాసరి వెంకట రమణ, శంకరయ్య, అరుణశ్రీ, సత్యప్రసాద్, విశ్వనాధ్ జోసెఫ్, వీర మల్లేష్, హన్మంత్, నాగభూషనం, సత్తయ్య గౌడ్, లలితా వాణి.. పద్య కవితలను మృధుమధురంగా ఆలపించి ఆహుతులను అలరించారు.

ఘరానా దొంగ అరెస్టు
* రూ. 60 వేల సొత్తు స్వాధీనం

హైదరాబాద్, డిసెంబర్ 12: ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఓ కరుడుగట్టిన నేరస్థుడిని కాచిగూడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ. 60వేల సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ జె నర్సయ్య తెలిపిన విరాలిలావున్నాయి. హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన జగదీప్ విజయ్‌కుమార్ అలియాస్ విజయ్ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 2014లో ఓ చోరీ కేసులో నల్లకుంట పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన విజయ్ మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడు. ఉదయం వేళల్లో బస్తీలు తిరుగుతూ తాళాలు వేసివున్న ఇళ్లను టార్గెట్ చేసుకుని రాత్రివేళల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు విజయ్‌పై పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు నమోదై ఉన్నాయి. కరడుగట్టిన నేరస్థుడిపై సీడీసీ షీట్ కూడా ఓపెన్ చేసినట్టు ఏసీపీ నర్సయ్య తెలిపారు. నిందితుడిని పట్టుకున్న డీఎఏస్‌ఐ సిహెచ్ శ్రీను, ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణలను ఏసీపీ అభినందించారు.