హైదరాబాద్

నిమ్స్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 12: నిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మిలీనియం బ్లాక్‌లోని న్యూరాలజీ విభాగం వైద్యులు డాక్టర్ రూపం చాంబర్‌లో ఏసీ షార్ట్‌సర్య్కూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో ఓపీ సేవలకు వచ్చిన రోగులు భయభ్రాంతులతో పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకొని ఆర్పివేశారు. ఏసీ పూర్తిగా దగ్ధం కాగా, కేవలం కిటికీ మాత్రమే కాలిపోయింది. మంటలు కేవలం ఒక్క గదికే పరిమితం కావడంతో పెనుప్రమాదం తప్పింది.
నిమ్స్‌లో సెక్యూరిటీ గార్డుల నిరసన
నిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు మరోమారు నిరసనకు దిగారు. వేతనాలు చెల్లించాలంటూ మంగళవారం నిమ్స్ సెక్యూరిటీ కార్యాలయం ముందు బైఠాయించారు. యాజమాన్యానికి, కాంట్రాక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటల తరబడి విధులు నిర్వహిస్తున్నా సకాలంలో వేతనాలు అందక పోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల వేతనాల కోసం నిరీక్షించాల్సి వస్తుండటంతో కుటుంబాలను పోషించలేని దుస్థితి నెలకొందని కన్నీరుపెట్టుకున్నారు.
సభ్యత్వాల పేరుతో అక్రమ వసూళ్లు

డెక్కన్ క్లబ్ ఉద్యోగి నాగేంద్రబాబు అరెస్టు

హైదరాబాద్, డిసెంబర్ 12: డెక్కన్ క్లబ్‌లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. మెంబర్ షిప్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. సభ్యత్వాల పేరుతో నిధులు స్వాహా చేసినట్టు సిబ్బందిపై క్లబ్ అధ్యక్షుడు అవినాష్ గుప్త తుకారాం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. క్లబ్‌లో రూ. కోటిన్నర వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో డెక్కన్ క్లబ్ కార్యదర్శి రమేశ్ రెడ్డి, మాజీ కోశాధికారి నాగేంద్రబాబు, అకౌంటెంట్ మంజులతతోపాటు ఆసిం కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. 1900 సంవత్సరంలో ఏర్పడిన డెక్కన్ క్లబ్‌లో 1400 మంది సభ్యులు ఉన్నారు. సభ్యత్వ రుసుం రూ. 3,00,000లు కాగా, ప్రతి నెలా రూ. 625లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గత జూన్ 28న క్లబ్ అధ్యక్షుడు అవినాష్ గుప్తా 2016-17 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 30నుంచి 40 లక్షలు నిధులు దుర్వినియోగమైనట్టు తుకారం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా కోటిన్నర రూపాయలు దుర్వినియోగమైనట్టు తేలింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఏ1 నిందితుడు ఆసిం కుమార్ వద్ద నుంచి రూ. 10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, క్లోసింగ్ బ్యాలెన్స్ 30,167, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈస్ట్‌మారెడ్‌పల్లిలో రూ. 8.18 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు క్లోసింగ్ బ్యాలన్స్ 1,21,788లు, కాగా మొత్తం 19,69,955లు స్వాధీనం చేసుకున్నారు. ఏ2 నిందితురాలు వద్ద నుంచి రూ. 31,639 బాంక్ ఆఫ్ బరోడా మల్కాజ్‌గిరి బ్రాంచిలో నగదును స్వాధీనం చేసుకున్నట్టు నార్త్‌జోన్ డీసీపీ బి సుమతి తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఇన్స్‌పెక్టర్ జి కిషన్, ఏసిపి కె శ్రీనివాస్‌లను డీసీపీ అభినందించారు.