హైదరాబాద్

సనాతన ధర్మంలోని విలువలను కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, డిసెంబర్ 14: సనాతన ధర్మంలోని విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. జివిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘సప్తపదిలో తోడూనీడ’ కార్యక్రమం గురువారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోశయ్య వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన దంపతులకు పురస్కారాలను ప్రదానం చేశారు. హిందూ సంప్రదాయంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. భర్త విజయం వెనుక భార్య ఉంటుందని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ పి.విజయ బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి కుంటుంబ వ్యవస్థ కేవలం భారతీయ సంస్కృతిలో ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కన్వీనర్ కే.గీతా మూర్తి, శంకరం వేదిక అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, లయన్ జయ ప్రకాష్ రెడ్డి, సంస్థ చైర్మెన్ గుదిబండి వెంకట రెడ్డి, ప్రధాన కార్యదర్శి వివి రాఘవ రెడ్డి పాల్గొన్నారు.
మొక్కరాల కృష్ణకుమారికి ‘గురువందనమ్’
కాచిగూడ, డిసెంబర్ 14: ప్రముఖ సంగీత విద్వాంసురాలు మొక్కరాల కృష్ణ కుమారికి ‘గురువందనమ్’ కార్యక్రమం శ్రీత్యాగరాయ గానసభలో గురువారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళారత్న డా.కె.శివ ప్రసాద్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి పాల్గొని కృష్ణకుమారిని సత్కరించి అభినందించారు.
26న శతాధిక గాయనీమణులతో
సినీ సంగీత విభావరి
కాచిగూడ, డిసెంబర్ 14: ఘంటసాల జయంతి సందర్భంగా శ్రీ లలిత కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన ప్రముఖ గాయకుడు త్రినాథరావుచే శతాధిక గాయనీమణులతో ఘంటసాల సినీ యుగళ గీత విభావరి కార్యక్రమం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు గన్నవరపు లలిత తెలిపారు. గానసభలో విలేఖరులతో మాట్లాడుతూ.. శ్రావ్యంగా పాడగల గాయనీమణులు వయస్సుతో నిమిత్తం లేకుండా పాల్గొనవచ్చన్నారు. వర్థమాన గాయకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న వారు మరిన్ని వివరాలకు 9000008571ను సంప్రదించాలని కోరారు.
గాయకులకు మార్గదర్శకుడు ఘంటసాల
కాచిగూడ, డిసెంబర్ 14: నేటి గాయకులకు ఘంటసాల మార్గదర్శకుడని ప్రముఖ సినీ నటుడు రావి కొండల రావు అన్నారు. ఘంటసాల జయంతి సందర్భంగా ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ‘పరమానంద శిష్యుల కథ’ చిత్ర ప్రదర్శన వంశీ ఇంటర్నేషనల్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రావి కొండలరావు మాట్లాడుతూ.. ఘంటసాల గాయకుడిగా ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాధించుకున్నారని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ సినీ గాయకుడు కెబికె మోహన్ రాజు, రావి కొండలరావుకు ‘చిత్రద్యుతి’ పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, రాజేంద్ర ప్రసాద్, తెనే్నటి సుధాదేవి, పాల్గొన్నారు.