హైదరాబాద్

నేటి నుంచి తెలుగు వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: మధురమైన తెలుగు భాష గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటిచెప్పేందుకు నేటి నుంచి నగరం వేదికగా తెలుగు భాష పండుగ మొదలుకానుంది. ప్రపంచ తెలుగు మహాసభలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఈ మహాసభలకు అంకురార్పణ జరగనుంది. దేశవిదేశాలకు చెందిన 1677 మంది ప్రతినిధులు ఈ సభలకు హాజరుకానుండగా, వీరిలో 427 మంది విదేశీ ప్రతినిధులు కాగా, మిగిలిన 1250 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారు. వీరితో పాటు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు విశిష్ట అతిధులుగా హాజరుకానున్నారు. ఎల్‌బీ స్టేడియంతో పాటు మరో ఐదు సాంస్కృతిక వేదికల్లో ఐదురోజుల పాటు జరగనున్న ఈ సభలకు దేశ విదేశాల నుంచి తెలుగు సాహితీ వేత్తలు, కవులు, రచయితలు, సాహిత్య విశే్లషకులు, విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నందున నగరాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ముఖ్యంగా నగరంలో ముఖ్య సాంస్కృతిక వేదికలుగా పేరుగాంచిన రవీంద్రభారతి, పబ్లిక్‌గార్డెన్స్‌లోని లలితకళాతోరణం, తెలంగాణ సారస్వత పరిషత్తు, తెలుగు విశ్వవిద్యాలయాలను విద్యుత్ దీపాలంకరణతో ఎంతో ఆకర్షనీయంగా ముస్తాబు చేశారు. దీనికి తోడు ఈ వేదికలకు చేరుకునే రహదారులకిరువైపులా అందమైన పూలకుండీలను ఉంచటంతో పాటు జంక్షన్లు, కూడళ్లను ప్రత్యేకంగా అలంకరించారు.
హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలు, తెలుగు తల్లి, బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ల కిందనున్న గార్డెన్లను రంగురంగుల లైట్లతో చూడచక్కగా అలంకరించారు. ఈ సాంస్కృతిక వేదికలకు చేరుకునే అన్ని మార్గాల్లోనూ తెలుగు భాష, తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అపురూపమైన చిత్రలేఖనాలను ఏర్పాటు చేశారు.
ఘన స్వాగతానికి ప్రత్యేక కమిటీ
పంచ తెలుగు మహాసభలకు హాజరుకానున్న అతిధులను సముచిత రీతిలో స్వాగతం పలికేందుకు జిల్లా కలెక్టర్ యోగితారాణా ప్రత్యేక కమిటీని నియమించారు. హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు చైర్మన్‌గా వ్యవహారించనున్న ఈ కమిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.ప్రశాంతి నోడల్ అధికారిగా వ్యవహారించనున్నారు. ఈ కమిటీ ప్రధాన వేదిక అయిన ఎల్‌బీ స్టేడియంతో పాటు ఇతర ఐదు వేదికలకు వచ్చే అతిధులు, ఆహ్వానితుల రాకపోకలను పర్యవేక్షించనుంది. సభలకు హైదరాబాద్ జిల్లా నుంచి హాజరుకానున్న తెలుగు పండితులు, తెలుగు భాష సాహిత్యం తదితర రంగాల్లో ప్రముఖులైన వ్యక్తులను గుర్తించేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక జాబితాను తయారు చేసింది.
రూ.2 కోట్లతో లైటింగ్
రూ. 45.60 లక్షలతో పూల అలంకరణ
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియం, అలాగే మరో ఐదు సాంస్కృతిక వేదికలకు చేరుకునే రోడ్లలోని కూడళ్లు, జంక్షన్లలో రూ. 2కోట్ల వ్యయంతో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఎల్‌బీ స్టేడియంతో పాటు ఐదు ప్రధాన వేదికల వద్ద ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం రూ. 45.60 లక్షల వ్యయంతో జీహెచ్‌ఎంసీ పూల మొక్కలు, పూలతో అలంకరించింది.
వ్యాపార సంస్థల పేర్లు తెలుగులో ఉండాలి
ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార సంస్థల నామ ఫలకాలు తెలుగులో రాయించి ప్రదర్శించే విధంగా చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పేర్లు తెలుగులో ప్రముఖంగా, స్పష్టంగా కన్పించే విధంగా యజమానులు చర్యలు తీసుకునేలా జోనల్, డిప్యూటీ కమిషనర్లు వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.