హైదరాబాద్

ఘనంగా బాపు జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, డిసెంబర్ 15: ప్రముఖ సినీ దర్శకుడు బాపు జయంతి సందర్భంగా రసాంజలి నిర్వహణలో సినీ సంగీత విభావరి శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, రసాంజలి అధ్యక్షుడు వై.మల్లికార్జునమ్ పాల్గొన్నారు. బాపు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాపు ఎన్నో కుంటుబ కథా చిత్రాలను నిర్మించారని పేర్కొన్నారు. బాపు చిత్రాలు ఎంతో అదరణ పొందాయని తెలిపారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, డిసెంబర్ 15: శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో గాయనీ మల్లెల వసుంధర నిర్వహణలో సినీ సంగీత విభావరి శుక్రవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి బింగి నరేందర్ గౌడ్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, గాయనీ లలిత పాల్గొన్నారు. ముందుగా సినారె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సభకు ముందు గాయకులు అలపించిన సినీ సంగీత విభావరి అందరిని అలరించింది.
ఆకట్టుకున్న చిత్ర ప్రదర్శన
కాచిగూడ, డిసెంబర్ 15: ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ‘ఆలీబాబా నలభై దొంగలు’ చిత్ర ప్రదర్శన వంశీ ఘంటసాల ఇంటర్నేషనల్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో ప్రదర్శించారు. కార్యక్రమానికి ఘంటసాల గానసభ అధ్యక్షుడు కేవీ రావు, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, రాఘవ చార్య, తెనే్నటి సుధాదేవి, కొత్త కృష్ణవేణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేవీ రావుకు చిత్రద్యుతి పురస్కారం ప్రదానం చేశారు. సభకు ముందు ప్రదర్శించిన చిత్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
సంప్రదాయ ఆభరణాలే ఇష్టం
ఖైరతాబాద్, డిసెంబర్ 15: సంప్రదాయ ఆభరణాలంటే ఎంతో ఇష్టమని కార్పొరేటర్ మనె్న కవితా రెడ్డి అన్నారు. శుక్రవారం సోమాజిగూడాలోని మలబార్ షోరూమ్‌లో ఏర్పాటుచేసిన అన్‌కట్ జ్యూయలరీ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన డిజైన్లు ఎన్ని వచ్చినా సంప్రదాయ ఆభరణాలకు ఆదరణ తగ్గదని అన్నారు. ఈనెల 24 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని షోరూమ్ నిర్వాహకులు జీజీష్ తెలిపారు.