హైదరాబాద్

అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు అందుకున్న చిందం పాండు వంశరాజ్ అభినందర సభ నిర్వహించారు. జాతీయ వంశరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై పాండు వంశరాజ్‌ను సన్మానించారు. ఈ సందర్బంగా యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండారి సాయిబాబుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యారావు, నర్సింహ సగర, గాండ్ల శ్రీనివాస్, నారాయణ, ముప్పు బిక్షపతి, ప్రేమ్‌కుమార్, మల్లేష్, శివయ్య పాల్గొన్నారు.
నమ్మకంగా ఉంటూ యజమానిని
మోసగించిన డ్రైవర్ అరెస్టు
* కారు, రూ. 11.50 లక్షల నగదు స్వాధీనం
ఖైరతాబాద్, డిసెంబర్ 16: నమ్మకంగా ఉంటూ యజమానిని మోసగించిన కారు డ్రైవర్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 11.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శనివారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస రావు కేసు వివరాలను వెల్లడించారు. శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉండే వ్యాపారి శేఖర్ వద్ద నెల్లూరుకు చెందిన సతీష్ బాబు కారు డ్రైవర్‌గా చేరాడు. చాలా కాలంగా నమ్మకంగా ఉంటుండటంతో వ్యాపారి తన స్వంత పనులను సైతం అప్పగించేవాడు. ఇదే తరహాలో సోమవారం తన వద్ద ఉన్న 12.5 లక్షల నగదును ఇచ్చి కూకట్‌పల్లిలోని తన బందువుల ఇంట్లో ఇచ్చిరావాల్సిందిగా పురమాయించాడు. భారీ మొత్తంలో డబ్బు కనిపించడంతో వాటిని దొంగిలించుకు పోవాలని నిర్ణయించుకున్న సతీష్‌బాబు కారుతో సహా ఉడాయించాడు. డబ్బులు ఇచ్చేందుకు వెళ్లిన డ్రైవర్ చాలాసేపటి వరకు వెనక్కి తిరిగి రాకపోవడంతో ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. దీంతో బంధువులను ఆరా తీయగా తమ వద్దకు రాలేదని సమాదానం చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. దీంతో డ్రైవర్ డబ్బులు దొంగిలించుకొని వెళ్లిపోయాడని నిర్ణయించుకొని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని శనివారం సతీష్‌ను అదుపులోనికి తీసుకొని ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని బుకాయించాడు. దీంతో అతని పోలీస్‌స్టేషన్‌కు తరలించి పూర్తిస్థాయిలో విచారించగా చోరీ విషయాన్ని వెల్లడించాడు. దీంతో అతని వద్ద నుంచి చోరీకి గురైన కారు, 11.50 లక్షల నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.