హైదరాబాద్

పక్కా ప్రణాళికతో రోడ్డు పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: మహానగరంలో నూతనంగా నిర్మించతలపెట్టిన రోడ్ల నిర్మాణాన్ని నిర్ణీత కాలంలోపు పనులు పూర్తి చేయాలని రోడ్ల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నియమించిన టాస్క్ఫోర్సు కమిటీ ఆదేశించింది. ఇందుకు అధికారులు, కాంట్రాక్టర్లు పనులు సజావుగా సాగేందుకు వీలుగా చక్కటి సమన్వయంతో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని కూడా సూచించించింది. శనివారం సాయ ంత్రం మేయర్ బొంతురామ్మోహన్, మున్సిపల్ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక అభివృద్ధి సంస్థ ఎండీతో పాటు హెచ్‌ఎండీఏ, రోడ్లు, భవనాలు తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నియమించిన ఈ టాస్క్ఫోర్సు కమిటీ ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో భాగంగా నగరంలోని సెంట్రల్ యూనివర్శిటీ నుంచి గోపన్‌పల్లి మీదుగా బీహెచ్‌ఈఎల్ వరకున్న రహదారిని 150 ఫీట్ల మేరకు విస్తరించాలని కమిటీ అభిప్రాయపడింది. అలాగే నల్లగండ్ల రోడ్డును కూడా విస్తరించాలని సూచించింది. రోడ్ నెం. 45 ధుర్గం చెరువునుంచి ఖాజాగూడ మీదుగా ఔటర్‌రింగ్ రోడ్డు వరకున్న రోడ్డును, గచ్చిబౌలీ రోడ్డును విస్తరించాలని సూచించింది. ప్రస్తుతమున్న కాంట్రాక్టర్ల పని సామర్థ్యం ప్రకారం న ఎలకు రూ. 168 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ పనులు మాత్రమే చేపట్టగలరని కూడా నిర్థారించింది. జీహెచ్‌ఎంసీ ద్వారా రూ. 710 కోట్ల వ్యయంతో మొత్తం 625 రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు టాస్క్ఫోర్సు స్పష్టం చేసింది. వీటిలో రూ. 280 కోట్ల వ్యయంతో 314 బిటీ రోడ్లను నిర్మించాలని, అలాగే రూ. 260 కోట్ల వ యయంతో 258 సీసీ రోడ్లను నిర్మించి, రూ. 40 కోట్ల వ్యయంతో వైట్‌టాపింగ్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు. రూ. 28 కోట్ల వ్యయంతో లేన్ మార్కింగ్, రేడియం లైటింగ్ తదితర పనులు చేపట్టాలని, అలాగే రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా ఇతర విభాగాలు చేపట్టాల్సిన పనుల గురించి కూడా వివరంగా చర్చించారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్లు జియావుద్దిన్, శ్రీ్ధర్, చీఫ్ సిటీ ప్లానర్ ఎస్. దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.