హైదరాబాద్

ఎమ్మార్పీఎస్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, డిసెంబర్ 17: సికిందరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి సంస్మరణ సభ ఆదివారం రాత్రి ముగిసిన అనంతరం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ట్యాంక్‌బండ్ ముట్టడికి పిలుపునిచ్చారు. సభావేదిక నుంచి ట్యాంక్‌బండ్‌కు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు వేలాదిగా బయల్దేరారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. సీఎం కేసీఆర్ కాల్పులు జరిపించినా వెనక్కి తగ్గేదిలేదని మందకృష్ణ చెప్పారు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై కుర్చీలు, కర్రలతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దాడి చేశారు. తెలుగు మహాసభల హోర్డింగ్స్, బ్యానర్లు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడే ఆందోళనకారులను అరెస్టుచేసే యత్నం చేశారు. మరోవైపు ప్యారడైజ్ వద్ద మందకృష్ణను పోలీసులు చుట్టుముట్టారు. దీంతో మరోసారి పోలీసులకు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీస్ పెట్రోలింగ్ బైక్‌లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ప్యారడైజ్ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అయింది. అర్ధరాత్రి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.