హైదరాబాద్

అడ్డంగా వడ్డన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: జిహెచ్‌ఎంసి అధికారులు ఆస్తిపన్ను వసూళ్లను అధికారులు వేగవంతం చేశారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం పూర్తికావడానికి ఇంకా ఎనిమిదిరోజులు మాత్రమే సమయం ఉండటంతో ఉన్నతాధికారులు విధించిన లక్ష్యాలను అధిగమించేందుకు సర్కిళ్ల స్థాయి అధికారులు, సంబంధిత ట్యాక్సు సిబ్బంది బకాయిదారుల వసూళ్లపై దృష్టి పెట్టారు. వందల్లో చెల్లించిన ఆస్తిపన్ను వేలల్లో, వెలల్లో చెల్లించాల్సిన ఆస్తిపన్ను లక్షల్లో చెల్లించాలంటూ పన్ను నోటీసులు రావటంతో బకాయిదారులు లబోదిబోమంటున్నారు. బెంచిమార్కు విధానం ప్రకారం నగరంలోని వివిధ రకాల భవనాలు, వాటి వినియోగం, మెయిన్‌రోడ్లు, కాలనీ రోడ్లు, సబ్ రోడ్లు, పోష్, సెమీ పోష్, మాస్ ఏరియాలు వంటి ఇతరత్ర ప్రాతిపదికన పన్నును వర్తింపజేస్తున్నారు. అయితే అధికారులు తమ లక్ష్యాన్ని అధిగమించేందుకు గాను ఇష్టమొచ్చినట్లు మొత్తంగా పేర్కొంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇదేమిటీ? గత సంవత్సరం తాము చెల్లించిన పన్ను మొత్తానికి ఇపుడు పంపిన నోటీసుల్లోని మొత్తానికి చాలా తేడా ఉందని సర్కిల్ కార్యాలయాన్ని ఆశ్రయించినా, ఇళ్ల యజమానులను చెప్పులరిగేలా తిప్పించుకుంటున్నారే తప్ప, ఎందుకు ఎక్కువ మొత్తంలో పన్ను వడ్డించాల్సి వచ్చిందో వెల్లడించలేకపోతున్నారు. కొన్ని పిటిషన్లకు సంబంధించి కమిషనర్, అదనపు కమిషనర్(రెవెన్యూ), జోనల్ కమిషనర్లు జారీ చేస్తున్న ఆదేశాలను సైతం ట్యాక్సు ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు అమలుకు చేయకుండా బుట్టదాఖలు చేస్తున్నారు. దీంతో కార్పొరేషన్‌కు నష్టం వాటిల్లే అవకాశముంది.
ఇదీ వీరి విధి నిర్వహణ తీరు
మాదన్నపేటలోని ఒకే భవనంలో గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో ఒకే తరహా విస్తీర్ణం కల్గిన రెండు ఫ్లాట్లకు అధికారులు పన్ను వడ్డించిన తీరును గమనిస్తే, వారికి ట్యాక్సు అసెస్‌మెంట్‌పై ఏ మాత్రం అవగాహన ఉందో తెల్సుకోవచ్చు. రెసిడెన్షియల్‌గా వినియోగిస్తున్న ఈ భవనంలోని కింద ప్లాట్‌కు వందల్లో పన్నును విధించగా, మొదటి అంతస్తులోని ఒక ఫ్లాట్‌కు కింది ఫ్లాట్ మాదిరిగానే పన్నును వర్తింపజేయగా, మరొక ఫ్లాట్‌కు వేలల్లో పన్ను వడ్డించారు. ఇదేమిటి అంటూ స్థానిక సర్కిల్ అధికారులను ప్రశ్నిస్తే ఎక్కువ పన్ను వడ్డించిన ఫ్లాటు అక్రమంగా నిర్మించిందేమోనంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒక వేళ అక్రమంగా నిర్మించినట్లు రుజువు చేస్తే, అధికారులు ఎక్కువ మొత్తంలో పన్ను వడ్డించిన ఈ ఫ్లాట్‌ను జిహెచ్‌ఎంసి వార్డు ఆఫీసుకు ఉచితంగా ఇచ్చేందుకు తాను సిద్ధమేనంటూ యజమాని సవాలు విసిరినా, నేటికీ స్థానిక అధికారులు ఆ సమస్యను పరిష్కరించలేదు.
దీంతో ఇంటి యజమానికి ఎలాగోలాగ కమిషనర్ జనార్దన్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా, క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలని స్థానిక డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించగా, ఆయన కూడా నేటికీ ఈ వ్యవహారంపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదు. దీంతో తమకు జీతాలు చెల్లించే కార్పొరేషన్‌కు ఆదాయాన్ని సమకూర్చటంలో అధికారులెంత పారదర్శకతతో వ్యవహారిస్తున్నారన్నది తేలిపోయింది. ఆస్తిపన్నుకు సంబంధించి నోటీసుల్లో సమాచార సవరణ, పన్ను ఎక్కువ మొత్తంలో వర్తింపజేశారన్న అనుమానం కల్గితే, బకాయి మొత్తాన్ని సవరించుకునేందుకు రీ పిటిషన్ చేసుకునే వెసులుబాటు బకాయిదార్లుకు కల్పించినా, ఏ మాత్రం ప్రయోజనం చేకూరటం లేదు.
ఇలాంటి చిన్న చిన్న లోపాల కారణంగా బకాయిదారులు కూడా పన్ను చెల్లించేందుకు ఆసక్తి చూపటం లేదన్న విషయాన్ని గుర్తించిన పూర్వ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆస్తిపన్ను సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి ఆదివారం ప్రాపర్టీ ట్యాక్సు పరిష్కారం’పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి మాసం నుంచి అధికారులు నగరంలోని అయిదు జోన్లు, 24 సర్కిళ్ల పరిధుల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నా, ఫలితాలు మాత్రం మొక్కుబడిగానే వస్తున్నాయి. ఆదివారం సెలవు రోజు కావటంతో చాలా సర్కిళ్లలో ఈ కార్యక్రమాన్ని తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. ట్యాక్సు విభాగం సంబంధిత సిబ్బంది రాకుండా ఓ అటెండర్, జూనియర్ అసిస్టెంట్లచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించటంతో బకాయిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు కుప్పలుగా పేరుకుపోయాయే తప్ప, అవి ఏ మాత్రం పరిష్కారం కావటం లేదు.
రీ పిటిషన్ అంటేనే..పండుగ
తమకు ఆస్తిపన్ను ఎక్కువగా వడ్డించారని, లేక కొత్తగా నిర్మించిన తమ ఇంటిని అసెస్‌మెంట్ చేసి ఆస్తిపన్ను పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ నిజాయితీగా వచ్చే ఇంటి యజమానులను ట్యాక్సు సిబ్బంది నిలువుదోపిడీ చేస్తోంది. కార్పొరేషన్ ఖాజానాకు చేరాల్సిన లక్షలాది రూపాయలను వీరు తమ జేబుల్లో నింపుకుంటున్నారు. కమర్షియల్ ఉంటే రెసిడెన్షియల్‌గా, యూసేజీ ఏరియాను తక్కువగా చూపుతూ బకాయిదారుడికి పన్నును తక్కువ చేస్తూ అతని వద్ద నుంచి ఎక్కువ మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారు. అంతటితో ఆగక, తమ ఇంటికి పన్ను వర్తింపును మరోసారి పరిశీలించాలంటూ వస్తున్న రీ పిటిషన్లను కూడా వీరు తమ అక్రమ సంపాదనకు ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు.