హైదరాబాద్

హక్కులను కాలరాస్తున్న సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు శాంతియుతంగా నిరసనను వ్యక్తం చేసే హక్కు ఉన్నా, పోలీసులు అక్రమంగా అరెస్టు చేయటం అప్రజాస్వామికమని నగర టీడీపీ అధ్యక్షుడు ఎం.ఎన్.శ్రీనివాస్‌రావు మండిపడ్డారు. టీడీపీ సీనియర్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం ఎంఎన్ ఆధ్వర్యంలో నగర తెలుగు తమ్ముళ్లు బేగంపేటలోని సీఎం క్యాంపు ఆఫీసును ముట్టడించేందుకు యత్నించారు. ముందస్తుగా సమాచారం తెల్సుకున్న పోలీసులు తెల్లవారుఝమున ఐదు గంటలకు ఎంఎన్‌తో పాటు ఇతర నేతలను హౌజ్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్టు అనంతరం ఆయన్ను ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎంఎన్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల పట్ల నిరసన వ్యక్తం చేసేందుకు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కును సైతం ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. జీహెచ్‌ఎంసీలో కూడా కూడా టీఆర్‌ఎస్ పాలక మండలి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను విస్మరించి పాలక మండలి వ్యవహారిస్తోందని ఎంఎన్ ఫైర్ అయ్యారు.