హైదరాబాద్

అక్రమ అరెస్టులను నిలిపివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జనవరి 12: ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ తెలంగాణలో అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయాలని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రైతు కూలి పోరాట సమితి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, పీఓడబ్ల్యూ, ఏఐఎఫ్‌టియూ, పీడీఎస్‌యూ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విమలక్క, నారాయణ రాజ్, అబ్బన్న, ఆవు నాగరాజు, మసూద్, మోహన్ బైరాగి, బీ.పద్మ, ప్రొఫెసర్ పీఎల్. విశే్వశ్వర రావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుందని, ప్రజల పక్షాన నిలిచే వారిపై కక్ష్యసాధింపుచర్యలకు పాల్పడుతూ అక్రమ అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవలే జనశక్తి నాయకులు బొమ్మన నర్సింహ, సంధానీలను హైదరాబాద్‌లో అరెస్టు చేసి పోలీసులు మానుకోట జిల్లా గుడూరు మండలం అప్పరాజుపల్లి అడవి ప్రాంతంలో అరెస్టు చేశామని ప్రకటించడాన్ని వేదిక తీవ్రంగా ఖండించింది. దొరల పాలన కొనసాగిస్తూ కేసీఆర్.. తెలంగాణ ద్రోహి మారి ప్రజలపై సరికొత్త దాడిని పాల్పడుతూ పాసిస్టు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

పంచాయతీరాజ్ చట్టసవరణ ఎందుకు?
ఖైరతాబాద్, జనవరి 12: తెలంగాణ ప్రభుత్వం పంచాయితీరాజ్ చట్టసవరణ ఎందుకు చేపట్టాల్సి వస్తుందో ప్రజలకు వివరించాలని సర్పంచుల ఐక్య వేదిక డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి బహిరంగ లేఖ విడుదల చేసింది.
శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వేదిక అధ్యక్షుడు అందోల్ కృష్ణ మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 73, 74 సవరణ ప్రకారం 29 అధికారాలను బదిలీ చేయాలని అన్నారు. 2019 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలనే కుట్రతోనే పంచాయితీ చట్టంలో మార్పులకు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు.
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న దేశంలో పరోక్ష ఎన్నికల ద్వారా సర్పంచులను ఎన్నుకునే విధానాన్ని తీసుకురావాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు ఎన్ని నిధులు ఇచ్చారో శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ద్వారా ఎన్నుకున్న సర్పంచులపై మరో కమిటీలు వేయాలనే ఆలోచన దేనికి, సర్పంచులు వార్డు మెంబర్‌ల ద్వారా ఎన్నికైతే నిత్యం అవిశ్వాసం భయంతో గ్రామాభివృద్ధికి పాటుపడాతారా?, 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణలో తిరిగి పంచాయితీ చట్ట సవరణ ద్వారా పటేల్, పట్వారీ, వ్యవస్థను తీసుకురావడానికి కాదా? ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలను ప్రజలకు వివరించి, చట్టసవరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో అంజనీ ప్రసాద్, బాలగొండు, సాయిలు, అనంత రామిరెడ్డి, మోహన్ రావు పాల్గొన్నారు.