హైదరాబాద్

ముమ్మరమైన ‘స్వచ్ఛ’ కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: మహానగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దటంలో భాగంగా, స్వచ్ఛతపై అవగాహన పెంచేందుకు జీహెచ్‌ఎంసీ విశ్వప్రయత్నాలను చేస్తోంది.
వచ్చే నెల మొదటి వారంలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరగనున్నందున ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలకు, వారు ఆకర్షితులయ్యేందుకు తగిన చర్యలు చేపట్టింది. తడి,పొడి చెత్తను వేరు చేసి ఇచ్చిన వారిలో లాటరీ ద్వారా విజేతలను ఎంపిక చేసి లక్ష రూపాయల నజరానాను కూడా ఇస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ మాసానికి సంబంధించిన తడి,పొడి చెత్తను వేరు చేసి, ఆ ఫొటోలను స్వచ్ఛ ఆటోలకు అందించిన మియాపూర్‌కు చెందిన కె.సుధాకర్‌రెడ్డి లక్ష రూపాయల నగదు బహుమతికి విజేతగా ఎంపికయ్యారు. ఆయనతో పాటు దోమల నివారణపై ఏర్పాటు చేసిన మస్కిటో యాప్‌లో 16 ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చిన పది మందిని లాటరీ ద్వారా ఎంపికయ్యారు. విజేతలకు త్వరలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఈ నగదు బహుమతులను అందజేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.
‘స్వచ్ఛ’సైనికుడిగా పనిచేస్తా
తనతో పాటు అపార్ట్‌మెంట్,కాలనీలో ఉన్న ఇళ్లలో తడి,పొడి చెత్తను వరు చేసి ఆటోలకు అందించేందుకు స్వచ్ఛ సైనికుడిగా పనిచేస్తానని రూ .లక్ష నగదు బహుమతికి విజేతగా ఎంపికైన మియాపూర్ అ ల్లూరి సీతారామరాజునగర్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తన ఇంట్లో తన భార్య భువనేశ్వరి తడి,పొడి చెత్తను వేర్వేరు చేసి డస్ట్‌బిన్ల ద్వారా ఆటోలకు అందజేస్తుందని, ఫొటోను మాత్రం తాను స్వచ్ఛదూత్ యాప్‌లో అప్‌లోడ్ చేసి చైతన్య పరుస్తున్నామన్నారు.

రంగారె డ్డి జిల్లాలో సమస్యలను పరిష్కరించాలి

హైదరాబాద్, జనవరి 12: రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా టీ-మాస్ కమిటీ డిమాండ్ చేసింది. స్టీరింగ్ కమిటీ సభ్యుడు భూపాల్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న రేషన్, ఇళ్లు, విద్యా, వైద్యం వంటి సమస్యలతో పాటు 2013 చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని, నష్టపరిహారం ఇవ్వాలని, రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు పరిహారం ఇచ్చిన తర్వాతే పనులను ప్రారంభించాలని అన్నారు. తాగునీరు, డ్రైనేజీ, శ్మశానవాటికలు, ఇళ్ల స్థలాలు, పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని, జీవో నెంబరు 1235 ప్రకారం ప్రతి గ్రామంలో ఎస్సీ, ఎస్సీ శ్మశాన స్థలాలు కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లను పెంచి, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం అమలు చేయాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్‌ల రుణాలను సబ్సిడీలను విడుదల చేసి ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని మంచాల, ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ, అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్‌పేట్, హయత్‌నగర్, కందుకూర్, మహేశ్వరం, ఆమన్‌గల్లు, తలకొండపల్లి, కొత్తూరు, శంషాబాద్, శేరిలింగంపల్లి, గండిపేట్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, లిగోజిగూడ మండలం, డివిజన్ కేంద్రాల్లో గ్రామాల్లో వచ్చిన సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.