హైదరాబాద్

ప్రస్తుత పార్కింగ్ మూడింతలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: మహానగరంలో పార్కింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు త్వరలోనే ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. హోటళ్లు, మాల్స్, ఫంక్షన్ హాళ్లలో పార్కింగ్, ఫైర్ సేఫ్టీ, స్వచ్ఛ కార్యక్రమాలపై వాటి యజమానులతో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని వ్యాపార సంస్థలకు వచ్చే ట్రాఫిక్‌కు సరిపోయే పార్కింగ్‌ను ఏర్పాటు చేయటంతో పాటు ఫైర్ సేఫ్టీ పరికరాలు తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, హైదరాబాద్‌లో ఈ సమస్య మరింత జఠిలం కాకుండా ఉండేందుకు ప్రస్తుతమున్న పార్కింగ్ వ్యవస్థను మూడింతలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను నగరంలోని ఖాళీ స్థలాలు ఉన్న చోట్లలో ప్రత్యేక పార్కింగ్ కాంప్లెక్సులను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇటీవల ముంబైలో జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది దుర్మరణం పొందటాన్ని మేయర్ ప్రస్తావిస్తూ హైదరాబాద్ నగరంలోని అన్ని వ్యాపార సంస్థల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు తప్పకుండా ఉండాలన్నారు. అగ్నిప్రమాద నివారణ నిబంధనల్లో కూడా మార్పులు తేనున్నట్లు ఆయన వివరించారు. నగరంలోని ప్రస్తుతం రోజుకి 4500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందిని, వీటిలో వెయ్యి టన్నులు హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్ల ద్వారా వస్తుందని తెలిపారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ చట్టం 2016ను అనుసరించి వదం కిలోల చెత్తను ఉత్పత్తి చేసే ప్రతి సంస్థ విధిగా కంపోస్టు యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో హైదరాబాద్ భూగర్భ జలాలల పరిరక్షణ కోసం ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ హైదరాబాద్ సాధనలో ప్రతి ఒక్కరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యాపార సంస్థ శుభ్రతపై చేపట్టిన చర్యలను వివరించే చార్జీలను ప్రదర్శించాలని తెలిపారు. కేవలం రూ. 50 ఇవ్వకుండా తమ ఇళ్లలోని చెత్తను రోడ్లపై వేస్తున్నారని, దీని వల్ల నగర సుందరీకరణకు ఆటంకం కల్గుతోందన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే స్వచ్ఛసర్వేక్షణ్‌లో హైదరాబాద్ నగరాన్ని అగ్రస్థానంలో నిలిపే విధంగా సహకరించాలని సూచించారు. సమావేశంలో పోలీసు అధికారులు రమేష్‌నాయుడు, చౌహాన్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లు ముషారఫ్, రవికిరణ్, శంకరయ్య, మనోహర్, జోనల్ కమిషనర్లు హరిచందన, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో భాగంగా ఉత్తమ కాలనీలు, ఆసుపత్రులు, పాఠశాలలకు ప్రత్యేక పురస్కారాలను అందజేశారు.