హైదరాబాద్

పతంగ్‌ల పండుగకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: సంక్రాంతి పండుగొచ్చిందంటే ఇంటి ముందు రంగురంగుల గొబ్బెమ్మలు దర్శనమిస్తేఆకాశయానంలో రంగురంగుల పంతంగ్‌ల విహంగం అన్ని వయస్సుల వారికి ఆనందాన్ని పంచుతుంది. సంక్రాంతి పండుగరోజు గాలిపటాలు ఎగురవేయటం ఆనవాయితీ.
పండుగ రోజున పోటీపడి మరీ గాలిపటాలను ఎగురవేస్తారు. గతంలో ఒకే వర్గానికి పరిమితమైన ఈ గాలిపటాల ఆనవాయితీ ప్రస్తుతం నగరంలోని దాదాపు అందరినీ ఆకర్షిస్తోంది. స్వరాష్ట్రం, స్వపరిపాలనలో ప్రభుత్వం కూడా కైట్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ రోజు కేరింతలు కొడుతూ గాలిపటాలు ఎగురవేయటంలో నిమగ్నమై ఉంటారు. గాలిపటాలు, దాన్ని ఎగురవేసేందుకు వినియోగించే దారం, అలాగే చర్కా వంటి సామాగ్రికే గాక, ఓ గాలిపటాన్ని మరో గాలిపటంతో కొట్లాడించే మాంజా తయారీకి కూడా నగరంలోని ధూల్‌పేట ప్రసిద్ధిగాంచింది. ఈ క్రమంలో ప్రతి ఏటా ధూల్‌పేట వాసులు కోట్లాది రూపాయల గాలిపటాలు, పాలీష్‌ధారం(సాదీ), మాంజాలు, చర్కాలను విక్రయిస్తున్నట్లు గాలిపటాల తయారీదారులు మహిళా తెలిపారు. ముఖ్యంగా ఈ సంవత్సరం సంక్రాంతికి చిన్నారులను ఆకట్టుకునేందుకు డొక్కాలం, నామమ్‌దార్, అంఖేధార్, కండా, పట్టీదార్, ధులన్, జీబియా, దో అండే వంటి పాత రకాలే గాక, ఈ సారి స్పైడర్‌మెన్, టైగర్, బట్టర్‌ఫ్లైలతో పాటు ఇంకెనె్నన్నో విభిన్నమైన ఆకృతుల్లో గాలిపటాలు ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ గాలిపటాలను తయారు చేసే కాగితం రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తయారీదారులు తెలిపారు.
అంతేగాక, దీని తయారీకి వినియోగించే కర్ర గతంలో ఇండోర్ నుంచి మన రాష్ట్రానికి దిగుమతి అయ్యేది. కానీ ప్రస్తుతం నగరంలోని కొందరు గాలిపటాల తయారీదారులు స్థానికంగా అందుబాటులో ఉండే వెదురును వినియోగించి కూడా గాలిపటాలను తయారు చేస్తున్నారు. అలాగే ఓ గాలిపటాన్ని మరో గాలిపటంతో కొట్లాడించేందుకు వినియోగించి మాంజాలో కూడా గాజర్, గంధక్, మోతీ, మిర్చీ, గుడ్డుమంజాల వంటి పాత మాంజాలే గాక, కొంతకాలంగా తంగూస్ మాంజా కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ మాంజా వినియోగం ప్రమాదకరమని, కొన్ని సార్లు వాహనదారులు, పాదచారుల మెడకు పట్టి దుర్ఘటనలు జరిగిన సంఘటనలు జరిగిన నేపథ్యంలో మాంజాను గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లో నిషేధించినట్లు గాలిపటాల తయారీదారులు తెలిపారు.