హైదరాబాద్

ఏటీఎంలలో ఏసిలను దొంగిలించే ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, కాచిగూడ, జనవరి 13: ఏటిఎంలలో డబ్బు కాదు ఆ దొంగలు ఎయిర్ కండీష్ యంత్రాలను చాలా సులభంగా దొంగలిస్తారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 ఎసిలను కంప్రెషర్లతో సహా దోచేశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 41 ఎటిఎంలలో 80 ఎసిలను దొంగిలించారు. హైదరాబాద్ ఈస్ట్‌జోన్ పరిధిలోని కాచిగూడ పోలీసులు ఈ దొంగల ఆట కట్టించారు. ఇందుకు సంబంధించిన వివరాలను డిసిపి సి.శిశిధర్‌రాజు వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి 75 ఎసి యంత్రాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎసిల విలువ రూ.15 లక్షలు ఉంటుందని చెప్పారు. మహ్మద్ అషన్ రహ్మాన్, సయ్యద్ అక్రమ్, మహ్మద్ ఆదిల్, మహ్మద్ ఇస్మాయిల్, మహ్మద్ వాజీద్ ఖాన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని కాచిగూడ, నల్లకుంట, సైదాబాద్, మలక్‌పేట, చాదర్‌ఘట్, అంబర్‌పేట, లాలాగూడ, తుకారాంగేట్, నారాయణగూడ, సైఫాబాద్, రామ్‌గోపాల్‌పేట, రెయిన్ బజార్, మీర్‌చౌక్, చత్రినాక, చాంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్, సంతోష్‌నగర్, మాదన్నపేట, మైలార్‌దేవపల్లి, కంచన్‌బాగ్, సంతోష్‌నగర్, మాదన్నపేట, సరూర్‌నగర్, బాలాపూర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎటిఎంల నుంచి ఎసి మిషన్లను చోరీ చేశారు. వీటిని ఫతేహ్ దర్వాజ ప్రాంతంలోని యూసఫ్ అనే వ్యక్తికి చెందిన నూర్ ఏజెన్సీలో 71 ఎసి మిషన్లు దాచి ఉంచారు. అందిన సమాచారం మేరకు వీటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు డిసిపి తెలిపారు. కాచిగూడ ఎసిపి జె.నర్సయ్య ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ కె.సత్యనారాయణ, ఎస్‌ఐ సి.హెచ్.శ్రీనివాస్ రెడ్డి కేసు దర్యాప్తు చేశారు.