హైదరాబాద్

పండక్కి ఊరెళుతున్నారా..? ఇల్లు జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: పండక్కి ఊరెళుతున్నారా..జర ఇల్లు జాగ్రత్త. ఇదే అవకాశంగా భావించి ఇళ్లలో చొరబడి దోచుకునే ముఠాలు కనే్నసి ఉంచాయి. ఊళ్లకు వెళుతున్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖ ముందునుంచీ హెచ్చరిస్తోంది. ఇళ్లకు తాళాలు వేసి ఉంటే పగుల గొట్టి దోచుకునే ముఠాలు నగరంలో సంచరిస్తున్నందున ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. నగరంలో చాలా మంది సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు తరలి వెళ్లడం వల్ల అవకాశం కోసం ఎదురు చూస్తున్న దోపిడీ దొంగలు కొందరు ఉంటే, ఇటీవల చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు వెల్లడి కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. చెడ్డీ గ్యాంగ్ ఇటీవల నగరంలో కొన్ని ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సిసి కెమెరాల్లోని దృశ్యాలు సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి. అలాగే పోలీసులు సైతం ఈ అంశంపై సీరియస్‌గా తమ నిఘాను పటిష్టం చేశారు. ముఖ్యంగా నగర శివారులో ఉండే వారు పండుగకు ఊరు వెళ్లడం, కాలనీల్లోజన సంచారం లేని వాటిని దోపిడీ ముఠాలు టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. రద్దీగా ఉన్న నగరంలో కన్నా శివారు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లనే తమకు అనువుగా ఉంటుందని భావించి దోచుకునేందుకు దొంగలు ప్రయత్నిస్తుంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీంతో సైబరాబాద్, రాచకొండ, రంగారెడ్డి జిల్లా పరిధిలో పోలీసు విభాగాలు అప్రమత్తమయ్యాయి. రాత్రి గస్తీని ముమ్మరం చేసి నేరాలను అరికట్టేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఇళ్లను వదిలి వెళ్లే వాళ్లు సమీపంలో ఉన్న తమ బంధువులు, పక్కింటి వారికి సమాచారం ఇవ్వడంతో పాటు వీలైతే ముందు జాగ్రత్తగా దగ్గరలోని పోలీసు స్టేషన్‌కు కూడా సమాచారం ఇవ్వడం మంచిది. నగరంలో చాలా ప్రదేశాల్లో సిసి కెమెరాలు ఏర్పాటైనప్పటికీ, శివారు ప్రాంతాల్లో ఇంకా సిసి కెమెరాలు అందుబాటులోకి రాలేదు. దీంతో ఎక్కడ సిసి కెమెరాలు లేవో, నిఘా, గస్తీ లేని ప్రాంతాలనే దొంగలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. రాత్రి గస్తీని పెంచడంతో పాటు నిఘాను ముమ్మరం చేశారు.