హైదరాబాద్

డబుల్ బెడ్‌రూం ఇళ్లపై శే్వతపత్రం విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: పేదల సొంతింటి కలను నిజం చేస్తామంటూ మురికివాడల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వెంటనే శే్వతపత్రం విడుదల చేయాలని టీడీపీ నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. లక్ష ఇళ్లను నిర్మిస్తామంటూ మురికివాడలను ఖాళీ చేయించడంతో అద్దె ఇంట్లో ఉంటూ పేద కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. శనివారం అధ్యక్షుడు ఎంఎన్ అధ్యక్షతన సిటీ ఆఫీసులో ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ వర్ధంతి, మార్చి 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవాల గురించి చర్చించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఎంఎన్ మాట్లాడుతూ మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఎంతో హడావుడి చేసి శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు ఆస్తి పన్ను మాఫీ అంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, కనీసం నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేయటం లేదని అన్నారు. పరిపాలనపై పట్టులేకపోవటంతో అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేకపోయారని విమర్శించారు. ఓటరు జాబితా సవరణ అంటూ జీహెచ్‌ఎంసీ అధికారుల అత్యుత్సాహంతో ఇప్పటి వరకు 17లక్షల 30వేల ఓట్లను తొలగించారని వివరించారు. ఓటరు జాబితా సవరణ పాతబస్తీలో మజ్లీస్ ఆఫీసుల్లో, న్యూ సిటీల్లో టీఆర్‌ఎస్ నేతలు, కార్పొరేటర్ల ఇళ్లలో మాత్రమే జరుగుతుందని అన్నారు.
పాతబస్తీలో అభివృద్ధి పనుల పేరిట ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని అధికార పార్టీ, మజ్లీస్ పార్టీ నేతలు చెబుతున్నా, పనులెక్కడ జరుగుతున్నాయో చూపించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలీ మస్కతీ ప్రశ్నించారు. చార్మినార్ వద్ద ప్రారంభించిన చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్టు పనులు నేటికీ పూర్తికాలేదని, పనుల కారణంగా రాకపోకలకు ఎంతో ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. పాతబస్తీకి మెట్రోరైలు కావాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ప్రజలను చైతన్యవంతులను చేస్తామని మస్కతీ అన్నారు.

సినారె చిరస్మరణీయుడు

కాచిగూడ, జనవరి 13: పద్మభూషణ్ డా.సీ.నారాయణ రెడ్డి చిరస్మరణీయుడని పలువురు వక్తలు అన్నారు. ‘సినారె సాహితీ వైజయంతి’ కార్యక్రమం సాధన సాహితీ స్రవంతి, శ్రీత్యాగరాయ గానసభ, భావ స్వారూప్య సాహిత్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, తెలుగు సాహిత్య కళాపీఠం కార్యనిర్వాహణ అధ్యక్షుడు డా.ఈటెల సమ్మన్న, బూర్గుల మధుసూదన్, పేరడి ప్రవీణ గురుస్వామి, సాధన నరసింహాచార్య, ఆచార్య టీ.గౌరీశంకర్ పాల్గొని సినారె చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సినారె సాహిత్యంలో విభిన్న పక్రియాల్లో రచనలు చేశారని పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో ఎన్నో పరిశోధనలు చేసి తెలుగు సాహిత్య అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త డా.ముక్తేవి భారతి ‘సినారె సాహిత్య రూపకాల వైశిష్ట్యం’ అనే అంశంపై ప్రసంగించారు.