హైదరాబాద్

నైట్‌షెల్టర్లతో రోగుల సహాయకులకు మెరుగైన సౌకర్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లోని పరిస్థితులు, సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, క్రమంగా సేవలు మెరుగుపడుతుండటంతో ఆదరణ కూడా పెరుగుతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి డా.సీ.లక్ష్మారెడ్డి అన్నారు. నిలోఫర్, మహావీర్, ఉస్మానియా ఆసుపత్రుల్లో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన వసతి గృహాలను మంత్రి మేయర్ బొంతు రామ్మోహన్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి శనివారం ప్రారంభించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు వందలాది మంది వచ్చే నిలోఫర్ ఆసుపత్రిలో వసతి గృహాం లేకపోవడంతో రోగుల సహాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, సౌకర్యవంతంగా ఉండేలా వసతి గృహాన్ని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. సుమారు రూ. రెండున్నర కోట్ల వ్యయంతో వసతి గృహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో జనాభాకు తగిన విధంగా అన్ని రకాల వౌలిక సదుపాయలను మెరుగుపరిచేందుకు ఓ కార్యచరణ ప్రకారం జీహెచ్‌ఎంసీ పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వాసుపత్రులకు రోగులతో పాటు వచ్చే వారి సహాయకులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రుల ఆవరణల్లో నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వసతి గృహాల్లో ఉండేవారు పరిశుభ్రతను పాటించి, స్వచ్ఛ సందేశాన్ని అందించాలని అన్నారు.

సుధాకర్‌పై ఆరోపణలు సత్యదూరం
* యాదవ హక్కుల పోరాట సమితి వెల్లడి
ఖైరతాబాద్, జనవరి 13: తిరమల తిరపతి దేవస్థానం చైర్మన్ పదవికి నియమితులైన సుధాకర్ యాదవ్‌పై ఉద్ధేశ్యపూర్వకంగానే కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని యాదవ హక్కుల పోరాట సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం సోమాజిగూడలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ మాట్లాడారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీటీడీ చైర్మన్ పదవిని బీసీ కులస్థుడైన సుధాకర్‌ను ఎంపిక చేయడం హర్షణీయమని అన్నారు. దీనిని జీర్ణించుకోలేని ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ నాయకులు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో వైఖరి మార్చుకోకపోతే అన్ని యాదవ సంఘాలతో పాటు బీసీ సంఘాలన్నింటినీ ఐక్యం చేసి ఆయా కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నర్సింహరావు యాదవ్, రుషికేష్ యాదవ్, వీరేందర్ యాదవ్, శశికిరణ్, రాజు పాల్గొన్నారు.