హైదరాబాద్

కాటేస్తున్న కాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: శివారులోని జవహర్‌నగర్ పరిసర ప్రాంతాలను కాలుష్యం కాటేస్తోంది. నగరంలోని 30 సర్కిళ్ల పరిధిలో ప్రతిరోజు పోగయ్యే సుమారు 4500 మెట్రిక్ టన్నుల చెత్తను ఇక్కడ వేయటంతో కాలుష్యం రోజురోజుకీ అధికమవుతోంది. దాదాపు 27 ఏళ్ల నుంచి చెత్తను ఇక్కడే నిల్వ చేస్తున్నారు. నగరం గ్రేటర్ కాకముందు మల్కాజ్‌గిరి, కాప్రా, అల్వాల్ మున్సిపాల్టీల చెత్త కోసం ఈ డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. ఈ యార్డు చుట్టున్న దాదాపు ఇరవై గ్రామాల్లో భూగర్భజలాలతో పాటు గాలి కూడా కలుషితమైపోతోంది. నేటికీ కూడా సిటీ నుంచి తరలించిన చెత్తను సుమారు అరవై అడుగుల ఎత్తు వరకు పేర్చి ఉండటం, ఉపరితలం నుంచి కాలుష్యపు గాలులు వీస్తున్నాయి. తీవ్రంగా వస్తున్న దుర్వాసన పరిసర ప్రాంతాల ప్రజలను ఊపిరి ఆడకుండా చేస్తోందని స్థానికులు వాపోతున్నారు. కారణంగా ఇప్పటికే పలువురు స్థానికులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేగాక, ఈ చెత్తకుప్పలో ఇనుము, ప్లాస్టిక్ వంటివి ఏరుకునేందుకు వచ్చి, ఈ కుప్పలు కూలటంతో స్థానికులు మృతి చెందిన ఘటనలు సైతం ఉన్నాయి. ఈ చెత్త కుప్పల నుంచి వ్యర్థ ద్రవ్యాలు(లీచెట్) బాగా కారుతుండటం, అది భూమిలోకి ఇంకిపోవటంతో భూగర్భ జలాలు మరింత కలుషితమవుతోంది. ఈ సమస్యకు పరిష్కారాన్ని సమకూర్చాలని కోరుతూ ఇటీవలే స్థానికులు వినూత్న తరహాలో నిరసన కూడా చేశారు. ఇప్పటికే డంపింగ్ యార్డు చుట్టున్న సుమారు 20 గ్రామాల్లో భూగర్భ జలాలు సైతం కలుషితమై తాగేందుకు, ఇతర అవసరాలకు కూడా ఉపయోగపడటం లేదు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున లీచ్ మళ్లీ భూమిలోకి ఇంకిపోవటంతో మున్ముందు ఎలాంటి పరిస్థితులెదురవుతాయోనని స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ డంపింగ్ యార్డుతో ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని కాస్త ముందుగానే అధికారులు గుర్తించి, ఈ వ్యర్థ ద్రవ్యాలను శుద్ది చేసేందుకు చేపట్టిన చర్యలు కూడా ఆశించిన ఫలితాలనివ్వటం లేదు. అధికారులు ఆశించిన దానిలో కేవలం 30 శాతం మాత్రమే వ్యర్థ ద్రవ్యాలు శుద్ధి అవుతుండటం అధికారులను ఒక రకంగా ఆందోళనకు గురి చేస్తుందని చెప్పవచ్చు. డంపింగ్ యార్డు చుట్టున్న గ్రామాలతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాప్రా, చెర్లపల్లి, ఏఎస్‌రావునగర్, నేరెడ్‌మెట్, అల్వాల్, కుత్బుల్లాపూర్, సికిందరాబాద్ కంటోనె్మంట్, మారేడ్‌పల్లి తదితర ప్రాంతాలకు కూడా కాలుష్యపు గాలులు వీస్తున్నాయి. డంపింగ్ యార్డు చుట్టూ ఉన్న 20 గ్రామాల్లోని ప్రజలంతా నిరుపేదలే. చిన్నాచితక పనులు చేసుకుని జీవించే వారే. వీరంత పొద్దంతా వృత్తి, విద్యా, ఉద్యోగం, కూలీ పనులు వంటి వాటికెళ్లి, సాయంత్రం ఇంటికొచ్చి ఆరుబయట సేద తీరుదామంటే దుర్వాసన, కాలుష్యపు గాలులతో నిద్రపట్టని పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు. కానీ చెత్తను శాస్ర్తియ పద్దతిలో క్యాపింగ్ చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నా, అది నామమాత్రంగానే చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.