హైదరాబాద్

బ్రహ్మానందంకు స్వర్ణకంకణ ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమలో హాస్యానికి మారుపేరుగా వెయ్యి యాభై ఆరు సినిమాల్లో నటించి పద్మశ్రీ పురస్కారం అందుకున్న డా. బ్రహ్మానందం దంపతులను మంగళవారం రవీంద్రభారతిలో ఘనంగా సత్కరించి స్వర్ణకంకణాన్ని ప్రదానం చేసారు. ‘అహనా పెళ్లంట’ చిత్రంతో హాస్య నటుడిగా ప్రజల్లో గుర్తింపు పొంది ఇరవై ఐదేళ్లుగా నటుడిగా వెలుగొందుతూ ప్రపంచంలోని తెలుగువారి అభిమానం పొందిన బ్రహ్మానందం తనకు హాస్యాన్ని వరంగా భగవంతుడు ప్రసాదించాడని అన్నారు. ముఖ్యఅతిథి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ, రాబోయే కాలంలో హాస్యనటులు బ్రహ్మానందాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. హాస్యానికి సాటిలేని వ్యక్తిగా తెలుగువారి ఆణిముత్యం బ్రహ్మానందం అని అన్నారు. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ లీడర్ పి.సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, మనిషికి హాస్యం ఒక వైద్యం అన్నారు. హాస్యానికి కేరాఫ్ చిరునామా బ్రహ్మానందం అన్నారు.