హైదరాబాద్

అభివృద్ధికి ఆంగ్లం దోహదం: వీసీ రామచంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, జనవరి 18: ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలతో మమేకం కావడానికి అభివృద్ధికి ఆంగ్లభాష ఎంతగానో దోహదపడుతోందని ఓయు వీసీ ప్రొ.రామచంద్రం పేర్కొన్నారు. గురువారం ఓయూలోని టెక్నాలజీ కళాశాల ఆడిటోరియంలో ‘ఆలిండియా ఇంగ్లీష్ టీచర్స్ 62వ జాతీయ సదస్సు’ను నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ ఆంగ్లబాష ప్రపంచ భాష అని నేడు జీవితంలో ఇది అంతర్భాగమై పోయిందని అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి పరస్పరం బదిలీ చేసుకోవడానికి ఆంగ్లమాధ్యమం ఎంతో దోహదం చేస్తోందని తెలిపారు. ఇంగ్లీష్‌ను కేవలం భాష గానే కాకుండా ఉపాధి కోసం ఉపయోగపడేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. సింహపురి యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.విశే్వశ్వర్ రావు మాట్లాడుతూ దేశంలో ఇంగ్లీష్‌ను ద్వితీయ భాషగా చూస్తున్నారని, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రొ.డీ.రవీందర్, యాదగిరి, డాక్టర్ పొన్న నాగేశ్వర్, డాక్టర్ అశోక్ పాల్గొన్నారు.